Home » Pawan Kalyan
గ్రేడ్ల వారీగా ఎర్రచందనం వివరాలను అధికారులను అడిగి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. స్మగ్లింగ్‌కు గురికాకుండా ఎర్ర చందనాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు.
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశభద్రత కేవలం కేంద్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని అన్నారు. ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని, దేశంలోని ప్రతి వ్యవస్థ కంచుకోటగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం తన ఎక్స్ ఖాతాలో టీటీడీపై ఓ పోస్టు పెట్టారు. గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని అన్నారు.
పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు.
సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేశ్, జనసేన అధినేత పవన్‌లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ.. విమర్శలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.
'పవన్ కళ్యాణ్.. మిమ్మల్ని కలిసి అన్నీ చెప్పాలని ఉంది. నాకు అపాయింట్మెంట్ ఇస్తారో లేదో తెలియదు' అని భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కోరారు. చంద్రబాబు, పవన్‌లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాని చెప్పారు.
ఏపీలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని.. ఇందుకోసం నవంబర్ 1వ తేదీ నుంచి డి.డి.ఓ..
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు.
ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు.
నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులతో మాట్లాడిన జనసేనాని మరోసారి ఇలా పార్టీకి నష్టం జరిగేలా చూస్తే మాత్రం సహించేది లేదని, ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పినట్లు సమాచారం.