మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
ABN , Publish Date - Jan 27 , 2026 | 07:27 PM
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నానిపై 196(1), 353(2), 351(2), 352 BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు. రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయిలో జరిగిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని రెచ్చిపోయి మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ శ్రేణులు.. మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పీఎస్‌లో నానిపై ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.
Also Read:
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్
Read Latest AP News And Telugu News