Home » Parliament
అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో కాంగ్రెస్ విప్ కె.సురేష్ మాట్లాడుతూ, ఎస్ఆర్ఐ అంశంపై చర్చించాలని విపక్షాలు కోరాయని, ఎస్ఐఆర్‌ను కూడా జతచేసి ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు సమావేశం నిర్ణయించిందని తెలిపారు.
కేవలం ఎస్ఐఆర్ పైనే కాకుండా ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఎస్ఐఆర్‌పై వెంటనే చర్చ జరగాలని ఉభయసభల్లోనూ విపక్షాలు పట్టుబడుతున్నాయి.
దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
పెంపుడు జంతువులను పార్లమెంటుకు తీసుకురావడం ఎంపీలకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగం చేయడమే అవుతుందని బీజేపీ ఎంపీ జగదాంబికాపాల్ అన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు పునఃప్రారంభమయ్యాక విపక్షాలు మరలా ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం పునఃప్రారంభం కానుంది.
శీతాకాల సమావేశాల తొలి రోజే పార్లమెంటు ముందున్న కీలక ఆంశాల గురించి మోదీ ప్రస్తావించే బదులు నాటకీయ ప్రసంగం సాగించారని ఖర్గే తప్పుపట్టారు. 11 ఏళ్లుగా పార్లమెంటరీ మర్యాదలు, వ్యవస్థను ప్రభుత్వం అణిచివేస్తోందన్నదే అసలు నిజమని అన్నారు.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'తో సహా 10 కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు వెల్లడయ్యాయి. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు జరుగుతాయని సంబంధిత శాఖా మంత్రి కిరణ్ రిజిజూ తెలిపారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరామ్ రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ వీల్‌చైర్‌పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.
పార్టీ విప్‌లు లేకుండా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఉప రాష్ట్రపతి పదవికి ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఎన్డీయే, 'ఇండియా' కూటమి నేతలు క్రాస్ ఓటింగ్ జరగవచ్చని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.