Share News

Bihar: పార్లమెంటు నిరవధిక వాయిదా

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:19 AM

బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఆపరేషన్‌ సిందూర్‌ సహా పలు అంశాలపై అధికార, విపక్షాల నడుమ వాగ్యుద్ధాలతో అట్టుడికిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి

Bihar: పార్లమెంటు నిరవధిక వాయిదా

ముగిసిన వర్షాకాల సమావేశాలు

  • 12 బిల్లులకు లోక్‌సభ

  • 15 బిల్లులకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 21: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌), ఆపరేషన్‌ సిందూర్‌ సహా పలు అంశాలపై అధికార, విపక్షాల నడుమ వాగ్యుద్ధాలతో అట్టుడికిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయసభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో స్పీకర్‌ ఓంబిర్లా సభను 12 గంటలకు వాయిదా వేశారు. అప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొనడంతో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశాలు జరిగినన్నాళ్లూ విపక్షసభ్యు లు సభ కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగించారని ఆయన మండిపడ్డారు.


అటు రాజ్యసభ కూడా.. విపక్షాల నిరసనలతో తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. మళ్లీ సమావేశమైన అనంతరం ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లును ఆమోదించి సభను నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివన్ష్‌.. సభలో అర్థవంతమైన చర్చ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ సెషన్‌లో లోక్‌సభలో 14 బిల్లులను ప్రవేశపెట్టగా.. 12 బిల్లులను ఆమోదించారు. రాజ్యసభలో 15 బిల్లులను ఆమోదించారు.

Updated Date - Aug 22 , 2025 | 05:19 AM