Share News

Subhanshu Shukla: భారత ఆస్ట్రొనాట్ శుభాన్షూ శుక్లా గౌరవార్థం నేడు పార్లమెంటులో ప్రత్యేక చర్చ

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:55 AM

అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన వ్యోమగామి శుభాన్షూ శుక్లా గౌరవార్థం నేడు పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరపనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

Subhanshu Shukla: భారత ఆస్ట్రొనాట్ శుభాన్షూ శుక్లా గౌరవార్థం నేడు పార్లమెంటులో ప్రత్యేక చర్చ
Subhanshu Shukla

ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన వ్యోమగామి శుభాన్షూ శుక్లా గౌరవార్థం నేడు పార్లమెంటులో ఎంపీలు ప్రత్యేక చర్చ జరపనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా పేర్కొన్నారు. శుభాన్షూ శుక్లా భారత దేశ హీరో అని ప్రశంసించారు. ఆయన అంతరిక్ష యాత్ర భారత చరిత్రలో ఓ కీలక మైలురాయిగా అభివర్ణించారు. ‘అంతరిక్ష యాత్రను మన హీరో శుభాన్షూ శుక్లా దిగ్విజయంగా పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. అంతరక్షి పరిశోధన రంగంలో భారత్ విజయాలు లక్ష్యాలపై ప్రత్యేక చర్చ ఉంటుంది’ అని మంత్రి అన్నారు.

ఈ చర్చలో ఎంపీలు శుభాన్షూ శుక్లా యాత్ర ప్రాధాన్యత గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. భవిష్యత్తు మిషన్స్‌కు ఇది ఎలా బాటలు పరచనుందో అనే అంశంపై కూడా చర్చిస్తారు. త్వరలో భారత్ నిర్వహించనున్న గగన్‌యాన్ మిషన్‌ గురించి కూడా సభ్యులు చర్చిస్తారని తెలుస్తోంది.


అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన భారత వ్యోమగామి శుభాన్షూ శుక్లా భారత్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని మొదలెట్టిన విషయం తెలిసిందే. ఐఎస్ఎస్‌లో శుభాన్షూ.. మైక్రోగ్రావిటీ ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందనే అంశాన్ని అధ్యయనం చేశారు. మెటీరియల్స్ సైన్స్‌కు సంబంధించి పలు పరిశోధనలు నిర్వహించారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని ఈ మిషన్ చాటి చెప్పింది. అంతరిక్ష పరిశోధన దిశగా భారత యువతను ప్రోత్సహించేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

దేవుడా.. పులులున్న అడవిలో పర్యాటకులను వదిలి పారిపోయిన గైడ్

పాక్ కోసం గూఢచర్యం.. జ్యోతి మల్హోత్రా కేసులో 2,500 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు

For More National News and Telugu News

Updated Date - Aug 18 , 2025 | 12:03 PM