Share News

Minta Devi 124 Years: ఓటర్ లిస్టులో 124 ఏళ్ల మహిళను గుర్తించడంపై గందరగోళం..టీ షర్టులు ధరించి ఎంపీల నిరసన

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:06 PM

మింతా దేవి పేరు ఇప్పుడు ఒక్క బీహార్‌కు సంబంధించినది మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అసలు ఈమె ఎవరు, ఏంటి మ్యాటర్, ఎంపీలు ఆమె ఫోటోతో ఉన్న టీ షర్టులు ఎందుకు ధరించారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Minta Devi 124 Years: ఓటర్ లిస్టులో 124 ఏళ్ల మహిళను గుర్తించడంపై గందరగోళం..టీ షర్టులు ధరించి ఎంపీల నిరసన
Minta Devi 124 Years

బీహార్ రాష్ట్రంలో ఓటరు జాబితాపై పెద్ద దుమారం చెలరేగుతోంది. కారణం ఏంటంటే, ఓ 124 ఏళ్ల వృద్ధ మహిళ మింతా దేవి (Minta Devi 124 Years) పేరు ఓటరు జాబితాలో కనిపించడమే. ఇది తెలిసిన ఇండియా కూటమి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వివాదంపై ప్రతిపక్షాలు ఈరోజు వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశాయి. మింతా దేవి ఫొటో ఉన్న టీ షర్టులు, వాటిపై 124 నాటౌట్ అని రాసి ఉన్న వాటిని ధరించి నిరసనలో పాల్గొన్నారు.


మింతా దేవి ఎవరు?

ఇటీవల బీహార్‌లో విడుదలైన ఓటరు ముసాయిదా జాబితాలో, మింతా దేవి అనే మహిళ వయస్సు 124 సంవత్సరాలు అని నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తి వయస్సుకంటే ఎక్కువగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల తన ప్రజెంటేషన్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇది నకిలీ జాబితా. ఎన్నో తప్పులు, అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆధారంగా చేసుకుని, ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.


కీలక నేతలంతా

ఈరోజు (ఆగస్టు 12న) పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, టీఎంసీకి చెందిన డెరెక్ ఓ బ్రెయిన్, డీఎంకేకు చెందిన టీఆర్ బాలూ, ఎన్సీపీ నేత సుప్రియా సులే వంటి కీలక నేతలంతా ఈ టీ-షర్టులు ధరించారు. ఈ టీ-షర్ట్ వెనుక భాగంలో 124 నాటౌట్ అని రాసి ఉంది. ఇది చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వినూత్న నిరసనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


ఎందుకు ఈ నిరసన?

బీహార్‌లో ఓటరు జాబితాలో జరిగిన మోసాలపై ప్రతిపక్షాలు గళం విప్పాయి. SIR ప్రక్రియలో తప్పులు, నకిలీ ఓటర్లు, మరీ ముఖ్యంగా 124 ఏళ్ల మింతా దేవి లాంటి వివరాలు ఆ జాబితాలో ఉండటం వారి ఆగ్రహానికి కారణమైంది. ఈ నిరసన ద్వారా ప్రతిపక్ష నాయకులు ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నిస్తూ, ఈ మోసాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 124 నాటౌట్ అనే స్లోగన్ ద్వారా వారు ఈ అంశాన్ని సీరియస్‌గా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీ-షర్టులు కేవలం నిరసన సాధనం మాత్రమే కాదని, ఈ సమస్య తీవ్రత గురించి చెప్పడమే ఉద్దేశమని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2025 | 04:34 PM