Google Pixel 10: సిమ్ స్లాట్‌కి గుడ్‌బై..గూగుల్ పిక్సెల్ 10 డిజైన్ లీక్స్ హాట్ టాపిక్
ABN , Publish Date - Aug 12 , 2025 | 03:24 PM
టెక్ ప్రియులకు గుడ్‌న్యూస్. గూగుల్ మరోసారి కొత్త టెక్నాలజీతో వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 20న గూగుల్ కొత్తగా డిజైన్ చేసిన పిక్సెల్ సిరీస్ ఫోన్‌లను పరిచయం చేయబోతోంది. అయితే ఈ లాంచ్‌లో ఓ ట్విస్ట్ ఉందని తెలుస్తోంది.
టెక్ ప్రపంచం నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. గూగుల్ తన కొత్త పిక్సెల్ డివైస్‌లను ఆగస్టు 20న లాంచ్ చేయబోతోంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. లీక్‌ల ప్రకారం, గూగుల్ పిక్సెల్ 10 (Google Pixel 10), పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL ఫోన్‌లలో ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను పూర్తిగా తీసేస్తుందట. అయితే ఎందుకు అలా చేస్తున్నారు, తర్వాత ఏం మార్పు రాబోతుందనే సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
సిమ్ కార్డ్ స్లాట్ ఎందుకు తీసేస్తున్నారు?
ఈ కొత్త పిక్సెల్ ఫోన్‌లు eSIM టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్నాయి. అంటే, ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ బదులు, రెండు యాక్టివ్ eSIM స్లాట్‌లు ఉంటాయి. eSIM అంటే ఎలక్ట్రానిక్ సిమ్, ఇది ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. దీనివల్ల ఫోన్‌లో స్పేస్ మరింత ఎక్కువ ఉంటుంది. డిజైన్ కూడా స్లీక్‌గా ఉంటుంది. అంతేకాదు ఫోన్‌ను వాటర్ రెసిస్టెంట్‌గా మార్చడానికి కూడా ఈ మార్పు మరింత సహాయం చేస్తుంది.
కానీ, ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. eSIM మార్చడం అంటే ఫిజికల్ సిమ్ కార్డ్‌ను స్వాప్ చేయడంలా అంత ఈజీ కాదు. కొంచెం టైం తీసుకుంటుంది. ఈ మార్పు ప్రస్తుతం అమెరికాలో మాత్రమే జరగొచ్చని టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ Xలో పోస్ట్ చేశారు.
ఈ టెక్ కొత్తది కాదా
ఇది పూర్తిగా కొత్త ఐడియా అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే యాపిల్ ఇప్పటికే తన iPhone 14, 15 మోడల్స్‌లో అమెరికాలో eSIM ఓన్లీ ఆప్షన్‌ను ఇచ్చింది. గూగుల్ కూడా ఇప్పుడు అదే దారిలో నడుస్తోంది. eSIM వల్ల ఫోన్ డిజైన్‌లో ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. ఇతర కాంపోనెంట్స్‌కు ఉపయోగపడుతుంది. కానీ, CAD రెండర్స్‌లో ఇప్పటికీ సిమ్ స్లాట్ కనిపిస్తోంది. సో, ఈ లీక్ ఎంతవరకు నిజమో ఆగస్టు 20న తేలిపోనుంది.
లాంచ్ ఈవెంట్‌లో ఏం ఆశించాలి?
గూగుల్ ఈ ఈవెంట్‌లో పిక్సెల్ 10 సిరీస్‌తో పాటు, పిక్సెల్ వాచ్ 4, పిక్సెల్ ఫోల్డ్ ప్రో 10, బడ్స్ 2a హెడ్‌ఫోన్స్‌ను కూడా ఆవిష్కరించనుంది. కానీ, ఒక చిన్న బ్యాడ్ న్యూస్. ఈ ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ అయిన వెంటనే కొనుగోలుకు అందుబాటులో ఉండవు. ఎంగాడ్జెట్ రిపోర్ట్ ప్రకారం, పిక్సెల్ వాచ్ 4, ఫోల్డ్ ప్రో 10, బడ్స్ 2a అక్టోబర్ వరకు సేల్స్‌లోకి రావు. సప్లై చైన్ ఇష్యూస్ వల్ల ఈ డిలే జరుగుతుందని తెలుస్తోంది.
ఇది ఫ్యూచర్ ట్రెండ్‌నా?
eSIM టెక్నాలజీ వైపు షిఫ్ట్ అవ్వడం ద్వారా స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ అవుతుందా. యాపిల్ ఇప్పటికే ఈ దారిలో ఉంది. ఇప్పుడు గూగుల్ కూడా ఫాలో అవుతోంది. భవిష్యత్తులో ఇతర బ్రాండ్స్ కూడా ఈ టెక్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి