Share News

Parliament News: కేంద్రం యూరియా ఇవ్వడం లేదు.. పార్లమెంటులో కాంగ్రెస్‌ ఏంపీల వాయిదా తీర్మానం

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:09 AM

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా మాత్రమే కేంద్రం సరఫరా చేసిందని చెప్పారు. ఆగస్టు 13వ తేదీ వరకు ఇంకా 6.60లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల పేర్కొన్నారు.

Parliament News:  కేంద్రం యూరియా ఇవ్వడం లేదు.. పార్లమెంటులో కాంగ్రెస్‌ ఏంపీల వాయిదా తీర్మానం
Parliament

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతపై పార్లమెంటులో తెలంగాణ కాంగ్రెస్‌ ఏంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మాన ప్రతిపాదనను లోకసభ సెక్రటరీ జనరల్‌కు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి పంపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా మాత్రమే సరఫరా చేసిందని చెప్పారు. ఆగస్టు 13వ తేదీ వరకు ఇంకా 6.60 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల పేర్కొన్నారు. ఇందువల్ల రాష్ట్రంలో 2.10 లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా కొరత ఏర్పడినట్లు ఆందోళన వ్యక్తం చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో పంటలకు అవసరమైన యూరియా దొరకక రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత ఏర్పడి రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీసినట్లు వెల్లడించారు. జూన్‌లో రావాల్సిన నైరుతి రుతుపవణాలు ముందుగానే ఈ ఏడాది మే 26న రాష్ట్రానికి వచ్చాయని, దాని వల్ల పంటలు వేయడం మొదలుపెట్టిన రైతులకు సకాలంలో యూరియా అందకపోవడంతో ఆ ప్రభావం పంటలపై తీవ్రంగా పడుతోందని వివరించారు. రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యూరియా కొరత అంశాన్ని లేవనెత్తేందుకు తనకు అనుమతి ఇవ్వాలని చామల కిరణ్ కుమార్ కోరారు.


అయితే రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా యూరియా కొరత తీవ్ర దుమారం రేపుతుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వివక్షత చూపిస్తూ.. యూరియా ఇవ్వడం లేదని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. అధికారంలో ఉన్న నేతలు యూరియాను బ్లాక్‌లో అమ్ముకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నాయి. ఏది ఎలా పోయినా.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నది వాస్తవం. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమో, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమో తెలియక రైతులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ యూరియా కొరత రైతన్నల వర్షాకాల పంట కలలను చిదిమేయకముందే పరిష్కారం అవుతుందని ఆశిందాం.


ఇవి కూడా చదవండి

డ్రమ్ములో పురుషుడి కుళ్లిన శవం.. ఫ్యామిలీ మిస్సింగ్..

చివరి నిమిషంలో విమానం రద్దు.. కారణం ఏంటంటే..

Updated Date - Aug 18 , 2025 | 11:31 AM