Share News

MP Lakshman on Congress: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి..

ABN , Publish Date - Aug 22 , 2025 | 01:15 PM

ఎంపీ లక్ష్మణ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.. పదిహేను బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం తెలిపితే ఒక్క చర్చలో కూడా కాంగ్రెస్ పాల్గొనలేదని తెలిపారు. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌కి ఎజెండా లేకుండా పోయిందని విమర్శించారు.

MP Lakshman on Congress:   రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి..

హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. 21 రోజుల వాడివేడిగా సాగిన పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్టీ(ఆగస్టు 22)తో ముగిసినట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. పార్లమెం‌ట్‌లో కాంగ్రెస్ అలజడి, అల్లర్లు చేస్తూ.. ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ద్వంద నీతి అవలంబించిందని విమర్శించారు. మణిపూర్, ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరగాలని మొదట డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ చర్చలో పాల్గొనకుండా తోకముడిచిందని ఆయన ఎద్దేవా చేశారు.


ఎంపీ లక్ష్మణ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.. పదిహేను బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం తెలిపితే ఒక్క చర్చలో కూడా కాంగ్రెస్ పాల్గొనలేదని తెలిపారు. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌కి ఎజెండా లేకుండా పోయిందని విమర్శించారు. పార్లమెంట్‌లో లేని చర్చకు ఆరోపణలతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చరిత్మకమైన బిల్లులో కాంగ్రెస్ ఎక్కడ చర్చకు రాలేదని స్పష్టం చేశారు. జైల్లో అవినీతి నేతలు ఉండాలని బిల్లు పెడితే కాంగ్రెస్ నేతలు దాన్ని అడ్డుకొని బిల్లులు చించేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెడతామని చెప్పారు కానీ ఇప్పుడు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను భ్రమలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.


కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి సదుర్శన్ రెడ్డి తెలుగు ప్రైడ్ అని రేవంత్ రెడ్డి అంటున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో పీవీ నరసింహారావును కాంగ్రెస్ ఎలా ఇబ్బంది పెట్టిందో చూశామని తెలిపారు. టి.అంజయ్యను ఏ విధంగా అవమానించారో ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. తెలుగు వారైనా వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా పోటీ చేస్తే అప్పుడు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం ఆరోజు NTR పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఆయనను రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండా చేశారని కాంగ్రెస్ విమర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ రోజుల్లో అధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ నైజం బయటపడిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వారి వైఖరి మార్చుకోవాలని లక్ష్మణ్ హితవు పలికారు.


ఇవి కూడా చదవండి

పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

గోదావరి - కావేరి అనుసంధానంపై కీలక భేటీ

Updated Date - Aug 22 , 2025 | 01:20 PM