BRS MP Suresh Reddy : పార్లమెంట్ సమావేశాలు నిరాశపర్చాయి: బిఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:46 PM
పార్లమెంట్ సమావేశాలు నిరాశపర్చాయని బిఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గోదావరి జలాలు, బనకచర్ల ఇష్యూపై సభలో లేవనెత్తామని తెలిపారు. వర్షాకాల సమావేశాల్లో రైతుల సమస్యల గురించి చర్చ జరగాలి..
ఢిల్లీ, ఆగస్టు 21 : పార్లమెంట్ సమావేశాలు నిరాశపర్చాయని బిఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. సభా కార్యక్రమాలు ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేదని చెప్పారు. గోదావరి జలాలు, బనకచర్ల ఇష్యూపై సభలో లేవనెత్తామని తెలిపారు. 'వర్షాకాల సమావేశాల్లో రైతుల సమస్యల గురించి చర్చ జరగాలి.. కానీ అలా జరగలేదు' అని సురేష్ రెడ్డి అన్నారు. తెలంగాణలో యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని సురేష్ రెడ్డి చెప్పారు.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశానని చెప్పిన సురేష్ రెడ్డి.. తెలంగాణలో యూరియా కొరత రాష్ట్ర ప్రభుత్వ లోపమేనన్నారు. ఈ విషయంలో కేంద్రం కూడా సరిగ్గా వ్యవహరించాలని ఆయన కోరారు. దేశంలో ఎక్కువ పాడి ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సురేష్ రెడ్డి చెప్పారు. అయితే, గత 10 సంవత్సరాలలో ఎరువుల విషయంలో ఎప్పుడూ ఇలాంటి కొరత లేదన్నారు.
'లక్ష టన్నుల ఎరువులు ఇచ్చామని కేంద్రం చెప్పింది. మా డిమాండ్ మేరకు వారం రోజుల్లో 50 వేల మెట్రిక్ టన్నులు ఇస్తామని హామీ ఇచ్చారు. షాప్ యజమానులు స్టాక్ స్టోర్ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు నష్ట పోతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు మా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. మాకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. తెలంగాణ కొరకు మేము నిర్ణయం తీసుకుంటాం. ఉపరాష్ట్రపతి ఇద్దరు అభ్యర్థులు సమర్థంగా ఉన్నారు. వాళ్ళని కేవలం దక్షిణాదికి పరిమితం చేయాలనే కుట్ర జరుగుతుంది.' అని సురేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి