Share News

Rahul Gandhi On BJP New Bill: మధ్యయుగాలకు నెట్టేసే బిల్లు: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Aug 20 , 2025 | 08:01 PM

ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా తొలగిస్తామనే బెదిరింపు వాతావరణాన్ని ఈ బిల్లు సృష్టిస్తుందని రాహుల్ అన్నారు

Rahul Gandhi On BJP New Bill: మధ్యయుగాలకు నెట్టేసే బిల్లు: రాహుల్ గాంధీ
Rahul Gandhi

న్యూఢిల్లీ: తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను పార్లమెంటుకు ముందుకు బీజేపీ తీసుకురావడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలనే ఎన్డీయే తీరు చూస్తుంటే మన దేశాన్ని మళ్లీ మధ్యయుగ కాలంలోకి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తోందని అన్నారు. ఈ బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా బుధవారంనాడు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా బిల్లులున్నాయని సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా తొలగిస్తామనే బెదిరింపు వాతావరణాన్ని ఈ బిల్లు సృష్టిస్తుందని రాహుల్ అన్నారు. 'సదరు వ్యక్తికి మీ ముఖం నచ్చకపోతే ఈడీకి చెప్పి కేసు పెట్టిస్తారు. 30 రోజుల్లోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తుల అధికారులను ఊడపీకేస్తారు' అని రాహుల్ ఆరోపించారు.


ధన్‌ఖఢ్ రాజీనామాపై ప్రశ్నలు

మాజీ ఉప రాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా, ఆయన మౌనం వెనుక పలు ప్రశ్నలు ఉన్నాయని రాహుల్ అన్నారు. పాత ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు వేణుగోపాల్ తనను కలిసారని, ఆయన వెళ్లిపోయారని తనతో చెప్పారని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎందుకు రాజీనామా చేశారు? ఎందుకు ఆయన ఆజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయారనేది పెద్ద మిస్టరీగా ఉందని అన్నారు. ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితిలో ఆయన ఎందుకు ఉన్నారు? దీని వెనుక ఏదో మిస్టరీ ఉందని ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసేలా ఉందని, వ్యవస్థలు బలహీనపరుస్తూ, ఎన్నికైన ప్రజాప్రతినిధులను భయపెడుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామని అన్నారు.


ఇవి కూడా చదవండి..

రాజీవ్ ప్రతాప్ రూడీతో చేతులు కలిపిన రాహుల్

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్

For National News And Telugu News

Updated Date - Aug 20 , 2025 | 08:02 PM