Home » Pakistan
ఫైసలాబాద్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ కైవం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రోటీస్ జట్టుతో ఐదు వన్డే సిరీస్‌లు జరగ్గా.. పాక్‌కు ఇది నాలుగో విజయం.
అఫ్గాన్ సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ గిరిజన, సరిహద్దు వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్లా నూరి పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాక్ సాంకేతక సామర్థ్యంపై ఖ్వాజా అసిఫ్ మరీ ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోందని, యుద్ధం అనేది వస్తే పిల్లల నుంచి పెద్దల వరకూ అఫ్గాన్ పౌరులు పోరాటానికి వెనుకాడరని హెచ్చరించారు.
శనివారం నాడు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ఐసీసీ సమావేశానికి పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ.. ఐసీసీ అధికారుల సమక్షంలో భేటీ అయ్యామని సైకియా అన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం బాగుందని, ఇరు పక్షాలూ ఈ సమావేశంలో సహృదయంతో పాల్గొన్నాయని తెలిపారు.
2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీసీ కొన్ని రూల్స్ ను రూపొందించింది. తాజాగా దుబాయ్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఖరారు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్లు చొప్పున పురుషులు, మహిళల జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయని ఆ కథనంలో పేర్కొన్నాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని యువత ప్రభుత్వంపై కదను తొక్కుతోంది. అక్కడి విద్యావిధానంలో లోపాలపై వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతోంది.
రహస్యంగా, చట్టవిరుద్ధంగా అణ్వాయుధ కార్యక్రమాలను దశాబ్దాలుగా కొనసాగిస్తున్న చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధ రణ్‌దీర్ జైశ్వాల్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఈ పర్యటన కోసం యాత్రికుల బృందం బస్ టిక్కెట్ల ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరూ రూ.13,000 చెల్లించారు. అయితే వారికి ప్రవేశం నిరాకరించడంతో ఆ టిక్కెట్ ఫేర్ తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది.
భారత్‌లో తయారయ్యే స్వీట్లు, ఇతర తినుబండారాలకు పాకిస్థాన్‌లో మంచి గిరాకీ ఉంటుంది. మన దేశపు స్వీట్లను పాకిస్థానీలు చాలా ఇష్టంగా తింటారు. హల్దీరామ్స్ వంటి కంపెనీలు తయారు చేసే స్వీట్లు ఎంత ఖరీదైనా వాటిని కొనుక్కుని తింటుంటారు.
అఫ్గానిస్థాన్ దూకుడుతో ఇక్కట్ల పాలవుతున్న పాక్ మళ్లీ భారత్‌పై నెపం నెట్టే ప్రయత్నం చేసింది. పాక్ తూర్పు, పశ్చిమ సరిహద్దుల వెంబడి భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని దాయాది దేశ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఆరోపించారు.
పాకిస్తాన్‌లోని 80 శాతం వ్యవసాయం సింధు జలాల మీదే ఆధారపడి సాగుతోంది. సింధు జలాలు పూర్తిగా ఆగిపోతే తట్టుకునే శక్తి పాకిస్తాన్‌కు లేదు. అది నేరుగా ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది.