Home » Pakistan
ఏసీసీ 2025 టోర్నీలో భారత్-ఏపై పాకిస్తాన్-ఏ జట్టు విజయం సాధించింది. ఇండియా నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో పాక్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
తీర్థయాత్రల కోసం పాకిస్తాన్ వెళ్లిన ఓ సిక్కు మహిళ కుటుంబానికి, భారత అధికారులకు షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సిక్కు ఆలయాల సందర్శన కోసం ఇండియా నుంచి పాకిస్థాన్ వెళ్లిన ఓ మహిళ కుటుంబానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇందుకు సంబంధించిన ‘నిఖానమా’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమెరికా దృష్టి తమపై పడేలా లాబీయింగ్ చేయించుకునేందుకు పాక్ ఏకంగా 5 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ సర్కారు కటాక్షం కోసం పాక్ ఏకంగా ఆరు సంస్థలతో అగ్రిమెంట్స్ కుదుర్చుకుందట. ఫలితంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ట్రంప్‌తో సమావేశం కాగలిగారట.
ఇస్లామాబాద్‌లో పేలుడు ఘటన నేపథ్యంలో శ్రీలంక ప్లేయర్లు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం పాక్‌లో పర్యటిస్తున్న వారు సొంత దేశానికి తిరిగెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి భారత్ కారణమని పాక్ ప్రధాని మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్ ప్రోద్బలంతోనే మిలిటెంట్లు దాడికి దిగారని ఆరోపించారు.
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ నషీమ్ షా ఇంటి వద్ద కాల్పుల ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని మయూర్ ప్రాంతంలో ఉన్న నషీమ్ నివాసంపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇంటి మెయిన్ గేట్, కిటికీలు ధ్వంసమయ్యాయి.
పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చెందిన ఎస్1 అనే సీక్రెట్ యూనిట్ రెండు దశాబ్దాలుగా భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్‌లో అధికశాతం ఉగ్రదాడుల వెనుక ఈ యూనిట్ హస్తం ఉన్నట్టు తెలిపాయి.
పాక్ ఆర్మీ చీఫ్ అధికారాలను మరింత విస్తృత పరిచేందుకు రాజ్యాంగ సవరణను ప్రతిపాదించిన షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలకు తెరతీశాయి. రిటైర్మెంట్ తరువాత కూడా ఆర్మీ చీఫ్‌పై కేసు పెట్టే వీలులేకుండా ప్రభుత్వం ఈ రాజ్యాంగ సవరణను ప్రతిపాదించింది.