Share News

మా దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేశారు.. అమెరికాపై పాక్ మంత్రి ఆగ్రహం..

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:31 AM

అగ్రరాజ్యం అమెరికా తన స్వప్రయోజనాలు, రాజకీయ ప్రాధాన్యాలు, అవసరాల కోసం పాకిస్థాన్‌ను వాడుకుందని, తర్వాత తమ దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేసిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేశారు.. అమెరికాపై పాక్ మంత్రి ఆగ్రహం..
Khawaja Asif statement

అగ్రరాజ్యం అమెరికా తన స్వప్రయోజనాలు, రాజకీయ ప్రాధాన్యాలు, అవసరాల కోసం తమ దేశాన్ని వాడుకుందని, తర్వాత టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేసిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ పార్లమెంట్‌లో మాట్లాడిన ఖవాజా అమెరికా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. 1999 తర్వాత అమెరికాతో పాకిస్థాన్ చేతులు కలపడం చాలా పెద్ద తప్పని ఆయన అభిప్రాయపడ్డారు (US Pakistan relations).


'అఫ్గానిస్థాన్ విషయంలో అమెరికాతో చేతులు కలపడం మనం చేసిన అతిపెద్ద తప్పు. దాని వల్ల పాకిస్థాన్ చాలా నష్టపోయింది. దాని పర్యావసానాలను ఇప్పటికీ అనుభవిస్తోంది. అవసరం తీరిన తర్వాత పాకిస్థాన్‌ను అమెరికా పట్టించుకోలేదు. పాక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎటువంటి సహాయమూ చేయలేదు. సైనిక పాలకులు జియా-ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్‌ల వల్ల పాక్ తనకు సంబంధం లేని యుద్ధాల్లో పాల్గొనాల్సి వచ్చింది. ప్రయోజనం పొందిన అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఆ పరిణామాలు పాక్‌ను వెంటాడుతున్నాయి' అని ఖవాజా అన్నారు (Khawaja Asif statement).


2001, సెప్టెంబర్ 11‌ దాడుల తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పని చేయడానికి అమెరికాతో పాకిస్థాన్ చేతులు కలిపింది (Anti US remarks Pakistan). అమెరికాతో కలిసి తాలిబన్లతో యుద్ధానికి దిగింది. కొద్ది సంవత్సరాల తర్వాత అమెరికా వెనక్కి తగ్గింది. అయితే తాలిబన్లతో యుద్ధం కారణంగా పాక్‌ మాత్రం హింస, తీవ్రవాదం, ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకుపోయింది. అమెరికాతో చేతుల కలపడం ద్వారా కొని తెచ్చుకున్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేమని పాక్ పార్లమెంట్‌లో ఖవాజా అన్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా-బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్.. భారత్‌కు ఇబ్బందేనా..


బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 11 , 2026 | 11:46 AM