ఆమెరికా విడుదల చేసిన ఇండియా మ్యాప్‌తో పాక్‌కు షాక్.. తర్వాత ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:06 PM
పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్ చిన్‌తో సహా జమ్మూ కశ్మీర్, లడఖ్ మొత్తం ప్రాంతాన్ని భారత భూ భాగంగా చూపించే భారతదేశ మ్యాప్‌ను అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేశారు. ఈ మ్యాప్ పాకిస్థాన్ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందట.
భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారైన తర్వాత అమెరికా విడుదల చేసిన ఇండియా మ్యాప్ పాకిస్థాన్‌కు షాకిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత భూ భాగంగా చూపించే భారతదేశ మ్యాప్‌ను అమెరికా వాణిజ్య ప్రతినిధి విడుదల చేశారు. ఈ మ్యాప్ పాకిస్థాన్ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందట. వారు వెంటనే అమెరికా అధికారులకు నచ్చచెప్పి ఆ మ్యాప్‌ను తొలగింపచేశారట (Washington India map).
అమెరికా విడుదల చేసిన ఇండియా మ్యాప్‌పై తమకున్న అభ్యంతరాల గురించి చెప్పిన తర్వాత అగ్రరాజ్య అధికారులు ఆ మ్యాప్‌ను తొలగించినట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను పాక్, చైనా చట్ట విరుద్ధంగా క్లెయిమ్ చేస్తున్నాయి. అయితే ఆయా వివాదాస్పద ప్రాంతాలను భారత్‌లో అంతర్భాగంగా చూపిస్తూ ఫిబ్రవరి ఏడో తేదీన అమెరికా సరికొత్త ఇండియా మ్యాప్‌ను విడుదల చేసింది. దీంతో పాక్ షాకైంది (India map row).
సరికొత్త భారత్ మ్యాప్‌ను చూసిన వెంటనే తాము అమెరికా అధికారులను సంప్రదించామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి తాజాగా వెల్లడించారు (US Pakistan news). గతంలో అమెరికా విడుదల చేసిన ఇండియా మ్యాప్‌లలో పీఓకే, అక్సాయ్ చిన్ వివాదాస్పద ప్రాంతాలుగా ఉండేవి. తాజాగా అమెరికా వాటిని భారత్‌లో అంతర్భాగాలుగా చూపుతూ మ్యాప్ రూపొందించి విడుదల చేసింది. కాగా, పీఓకే, అక్సాయ్ చిన్ ప్రాంతాలు భారతదేశానికి చెందినవనే విషయాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు వాదిస్తూనే ఉంది.
ఇవి కూడా చదవండి..
బంగ్లాదేశ్‌లో తారిక్ రెహ్మాన్ హవా.. పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న బీఎన్‌పీ..
బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..