Home » Nirmala Sitharaman
స్వయం ఉపాధి వ్యాపారవేత్తలైన(సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్స్) మహిళలకు కమ్యూనిటీ ఆధారిత రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం వాక్చాతుర్యాన్ని కాకుండా సంస్కరణలను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను 'యువశక్తి ఆధారితం' అని నిర్మల అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026-27లో విద్యకు పెద్ద పీట వేసింది. దేశంలో ప్రతీ జిల్లాలో బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు పలు నగరాలకు అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఫార్మా విద్యా, పరిశోధనకు జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.
బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత మంత్రి నిర్మలా సీతారామన్ 30 మంది విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్టు సమాచారం. బడ్జెట్ రూపకల్పన విషయాలు, విధి విధానాల గురించి వారితో మాట్లాడబోతున్నారు.
సెమీ కండక్టర్ మిషన్‌కు భారీ కేటాయింపులు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2026‑27ను ప్రవేశపెడుతున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఆర్థిక మంత్రి ప్రసంగం ప్రారంభమైంది.
నేడు (ఫిబ్రవరి 1, 2026) కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. ఇది ఏటా జరిగే ఒక ముఖ్యమైన రాజ్యాంగ, ఇంకా గౌరవప్రదమైన సాంప్రదాయం.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్మాదపూర్వకంగా కలుసుకున్నారు.