బడ్జెట్ 2026: అందరి ఆసక్తి ఈ అంశాలపైనే..
ABN , Publish Date - Feb 01 , 2026 | 10:31 AM
2026 బడ్జెట్‌పై వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు దృష్టి సారించారు. నిర్మలమ్మ తమకు గుడ్‌న్యూస్ చెబుతారని ఆశపడుతున్నారు. అలాగే 2026-27 వార్షిక బడ్జెట్‌లో కొన్ని కీలక అంశాలపై చాలా మంది దృష్టి సారించారు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్-2026ను పార్లమెంట్‌లో సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. 2026 బడ్జెట్‌పై వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు దృష్టి సారించారు. నిర్మలమ్మ తమకు గుడ్‌న్యూస్ చెబుతారని ఆశపడుతున్నారు. అలాగే 2026-27 వార్షిక బడ్జెట్‌లో కొన్ని కీలక అంశాలపై చాలా మంది దృష్టి సారించారు (Budget 2026)
జీఎస్టీ
2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.11.78 లక్షల కోట్లు ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 11 శాతం అధికం. అయితే ఇటీవల జీఎస్టీ రేట్లలో కోత విధించారు. ఈ నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ ఆదాయ అంచనాలు ఎలా ఉంటాయనే ఆసక్తి చాలా మందిలో ఉంది ( key issues Budget 2026).
పన్నుల ఆదాయం
2025-26 బడ్జెట్‌లో స్థూల పన్నుల ఆదాయాన్ని రూ.42.70 లక్షల కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. వీటిల్లో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.25.20 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల రూపంలో రూ.17.5 లక్షల కోట్లు రావొచ్చని ప్రతిపాదించింది. మరి, ఆ అంచనాలు ఎంత మేరకు సఫలీకృతమయ్యాయో తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే (Budget focus areas).
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
పెరుగుతున్న ద్రవ్యోల్బణం జీవన వ్యయాన్ని, నిత్యావసర ధరలను క్రమంగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో తమకు మిగిలే నికర ఆదాయం విషయంలో మినహాయింపును పెంచాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. పాత పన్ను విధానంలో ఈ పరిమితి రూ. 50,000గా, కొత్త పన్ను విధానంలో రూ. 75,000గా ఉంది. ఈ పరిమితిని ఈ బడ్జెట్‌లో రూ.లక్షకు పెంచాలని ఆశిస్తున్నారు (salaried class tax benefits).
ఈవీలపై పన్ను మినహాయింపు
చాలా మంది ఉద్యోగులు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. పర్యావరణ హితమైన ఈ చర్యను కంపెనీలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం కారు ఇంజిన్ సామర్థ్యం ఆధారంగా ట్యాక్స్‌ను లెక్కిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో దానిని మార్చాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రత్యేకమైన, అనుకూలమైన పర్క్విజిట్ వాల్యూయేషన్ నిబంధనలను తీసుకురావాలని కోరుతున్నారు.
హోమ్‌లోన్ వడ్డీపై మినహాయింపు
హోమ్‌లోన్ తీసుకున్న ఉద్యోగులకు వడ్డీపై పన్ను మినహాయింపు లభించే వెసులుబాటు గతంలో ఉండేది. అయితే కొత్త పన్ను విధానంలో దానిని తీసేశారు. ఆ మినహాయింపును మళ్లీ వేతన జీవులకు అందించాలనే డిమాండ్ వస్తోంది. హోమ్‌లోన్‌తో ఇళ్లు కట్టుకుని వాటిల్లో నివసించే వారికి వడ్డీపై మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు (Union Budget 2026).
రివైడ్జ్ రిటర్న్స్ గడువు పొడిగింపు
ప్రస్తుతం, సవరించిన లేదా ఆలస్యమైన ఆదాయపు పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 31 వరకు మాత్రమే దాఖలు చేయవచ్చు. విదేశీ ఆదాయం, విదేశీ పెట్టుబడులు ఉన్న వ్యక్తులకు ఈ తుది గడువు సవాలుగా మారుతోంది. ఈ తుది గడువును పెంచితే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాన్ని కచ్చితంగా రిపోర్ట్ చేయడానికి వీలుంటుందనే సూచనలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..