బడ్జెట్ ప్రసంగం.. 75 ఏళ్ల సాంప్రదాయానికి చెక్ పెట్టనున్న నిర్మలా సీతారామన్..
ABN , Publish Date - Feb 01 , 2026 | 09:49 AM
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 75 ఏళ్ల సాంప్రదాయానికి తెరదించబోతున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆమె పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా చేయబోయే ప్రసంగంలో బడ్జెట్‌లోని పార్ట్-ఎ కంటే పార్ట్-బి పైనే ఎక్కువగా దృష్టి సారించబోతున్నట్టు సమాచారం.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 75 ఏళ్ల సాంప్రదాయానికి తెరదించబోతున్నారు. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆమె పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా చేయబోయే ప్రసంగంలో బడ్జెట్‌లోని పార్ట్-ఎ కంటే పార్ట్-బి పైనే ఎక్కువగా దృష్టి సారించబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆమె ప్రసంగంలో మార్పులు జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి (budget tradition broken).
పార్ట్-ఎలో దేశ ఆర్థిక స్థితిగతులు, గణాంకాలు, విధాన ప్రకటనలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. పార్ట్-బిలో పన్ను ప్రతిపాదనలు, సాంకేతికరమైన ప్రకటనలు ఉంటాయి. సాధారణంగా పార్ట్-బిని చాలా క్లుప్తంగా వివరిస్తారు. ప్రసంగంలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. అయితే తాజా బడ్జెట్‌లో మాత్రం పార్ట్-బి గురించే ఎక్కువగా మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. వెంటనే అమల్లోకి వచ్చే విధానపరమైన చర్యలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు సమ ప్రధాన్యం ఇవ్వాలనే ఆలోచనతోనే ఇలా చేసినట్టు సమాచారం (75-year-old budget tradition).
దేశ వాణిజ్యం, తయారీ, ఎగుమతుల విషయంలో ప్రస్తుత సామర్థ్యాలను వెల్లడించడంతో పాటు భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలను ఎక్కువగా ప్రసంగంలో ప్రస్తావించబోతున్నారట (Union Budget India). అలాగే తాజా బడ్జెట్‌లో సంస్కరణలకు కూడా ప్రాధాన్యం ఇవ్వబోతున్నారట. మరికాసేపట్లో పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. స్వాతంత్ర్య వచ్చిన తర్వాత ఆదివారం నాడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతుండడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌తో ప్రపంచకప్ మ్యాచ్.. కుర్రాళ్లతో సచిన్, లక్ష్మణ్ చిట్‌చాట్..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..