Share News

కేంద్ర బడ్జెట్ 2026‑27.. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Feb 01 , 2026 | 09:36 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ కాపీని రాష్ట్రపతికి అందించారు. రాష్ట్రపతి బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.

కేంద్ర బడ్జెట్ 2026‑27.. రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్
budget 2026

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ కాపీని రాష్ట్రపతికి అందించారు. బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్రపతి దహీ చీని(పెరుగు, చక్కెర) తినిపించారు.


మరికొద్దిసేపట్లో.. ఉదయం 10.15 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా, నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి 75 ఏళ్ల సంప్రదాయానికి కూడా తెర దించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో పార్ట్ ఏ కంటే .. పార్ట్ బీపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

బడ్జెట్ ప్రసంగం.. 75 ఏళ్ల సాంప్రదాయానికి చెక్ పెట్టనున్న నిర్మలా సీతారామన్..

ఆదివారం స్టాక్ మార్కెట్ - బడ్జెట్ డే స్పెషల్: ఈ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు

Updated Date - Feb 01 , 2026 | 10:10 AM