Home » New Delhi
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ సెక్షన్, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) ప్రాజెక్టులు ప్రభుత్వ సమగ్ర ప్లాన్‌లో భాగంగా ప్రారంభమవుతున్నాయి. దేశరాజధానిలో మెరుగైన అనుసంధానం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టుల ముఖ్యోద్దేశం.
భారతరత్న అవార్డు గ్రహీత, భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశం యావత్తూ ఇవాళ అంజలి ఘటిస్తోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..
న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రేపు పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని, అమిత్ షా, రాజ్‌నాథ్..
మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ మరణాంతరం అతని భార్య హుమీదా భాను బేగం ఆదేశానుసారం 1562లో సమాధి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఎనిమిదేళ్ల పాటు నిర్మాణం జరిగింది.
రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎలాంటి మూల్యం మూల్యం చెల్లించుకునేందుకైనా తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మోదీ గతవారంలోనూ విస్పష్టంగా చెప్పారు. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు భారత్ మార్కెట్‌లోకి చొప్పించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తుండగా, ఇందుకు భారత్ సముఖంగా లేదు.
దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించేలా పాక్ చర్యలు ఉన్నాయని పలువురు దౌత్య నిపుణులు చెబుతున్నారు. ఆతిథ్య దేశాలు తమ దేశాల్లోని విదేశీ రాయబార కార్యాలయాలు, సిబ్బంది, వారి కుటుంబాల భద్రతకు కట్టుబడి ఉండాలని వియన్నా ఒప్పందం నిర్దేశిస్తోంది.
బిహార్లో ఎన్నికల జాబితాలో మోసాలు జరిగాయంటూ ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసేందుకు విపక్ష ఎంపీలు సమావేశమయ్యారు. ఆ సమయంలో జయాబచ్చన్ అక్కడకు చేరుకున్నారు.
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మంగళవారం కుండపోత వర్షం కారణంగా ప్రజాజీవనం స్తంభించిపోయింది. బిహార్లో వరదలు పోటెత్తి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తరాఖండ్లో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎమ్డీ హెచ్చరించింది.
ఢిల్లీలో వేర్వేరు చోట్ల ఉన్న కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పనిసామర్థ్యం, సమన్వయం పెరుగుతుందని కేంద్రం ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా మొదటి కర్తవ్య భవన్-3ని ప్రధాని ప్రారంభించారు.
ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మంది మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.