Share News

Swami Chaitanyananda: ఢిల్లీ గలీజ్ బాబా తెలివి.. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే బ్యాంకు నుంచి రూ.50 లక్షలు విత్ డ్రా

ABN , Publish Date - Sep 27 , 2025 | 08:29 AM

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఢిల్లీ బాబా వేర్వేరు పేర్లతో బ్యాంకు ఖాతాలు నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలియగానే ఆయన రూ.50 లక్షలు విత్‌డ్రా చేసినట్టు గుర్తించారు.

Swami Chaitanyananda: ఢిల్లీ గలీజ్ బాబా తెలివి.. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే బ్యాంకు నుంచి రూ.50 లక్షలు విత్ డ్రా
Swami Chaitanyananda Withdrawal From Bank

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో కొందరు కళాశాల విద్యార్థులపై లైంగిక వేధింపులు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామి చైతన్యానంద సరస్వతిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు కీలక విషయాలను గుర్తించారు. ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలియగానే చైతన్యానంద ముందు జాగ్రత్తగా బ్యాంకు నుంచి రూ.50 లక్షలు విత్ డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు (Swami Chaitanyananda withdrawal From Bank).

వేర్వేరు పేర్లతో స్వామి నిత్యానంద బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం వేర్వేరు వివరాలతో డాక్యుమెంట్స్ సమర్పించినట్టు తెలుసుకున్నారు. ఇక ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత బాబా ముందుజాగ్రత్తగా రూ.50 లక్షల నగదును బ్యాంక్ అకౌంట్ నుంచి ఉపసంహరించుకున్నట్టు గుర్తించారు (₹50 lakh withdrawal Timing).


ఇదెలా ఉంటే, శుక్రవారం ఢిల్లీ హైకోర్టు చైతన్యానందకు ముందుస్తు బెయిల్‌ను నిరాకరించింది. మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో నమోదైన కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు తొలి దశలో ఉందని కోర్టు అభిప్రాయపడింది. నిత్యానందపై అభియోగాల తీవ్రత దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదంటూ ఆయన పిటిషన్‌ను కొట్టేసింది (Delhi saint money withdrawal).

చైతన్యానంద మోసపూరిత టస్టులు ఏర్పాటు చేశారని డబ్బులు దండుకున్నారని కోర్టు అభిప్రాయపడింది. ల్యాండ్ లీజు ద్వారా వచ్చిన డబ్బును తన స్వీయ అవసరాలకు బదిలీ చేసినట్టు పేర్కొంది.

మొత్తం 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు చైతన్యానంద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారి మొబైల్ ఫోన్స్, సర్టిఫికేట్‌లను స్వాధీనం చేసుకుని భయభ్రాంతులకు గురి చేసినట్టు బాధితులు పేర్కొన్నారు. తన మాటకు ఎదురుచెప్పిన కొందరినీ కాలేజీ నుంచి పంపించేసినట్టు కూడా బాధితులు తెలిపారు. దీంతో, చాలా మంది నోరుమెదపకుండా ఉండిపోయారని అన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న చైతన్యానంద గురించి పోలీసులు విస్తృత స్థాయిలో గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

బేబీ అంటూ మెసేజీలు ఆ తరువాత బెదిరింపులు.. ఢిల్లీ బాబాపై విచారణలో షాకింగ్ వాస్తవాలు

ఉత్తర్ ప్రదేశ్‌ను డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నాం: ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2025 | 08:29 AM