Share News

UPITS 2025: ఉత్తర్ ప్రదేశ్‌ను డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నాం: ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 25 , 2025 | 03:03 PM

ఉత్తర్ ప్రదేశ్‌లో భారత రక్షణ రంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని మోదీ చెప్పారు. నోయిడాలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ షో సందర్భంగా మాట్లాడిన మోదీ..

UPITS 2025: ఉత్తర్ ప్రదేశ్‌ను డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నాం: ప్రధాని మోదీ
UPITS 2025

నోయిడా, సెప్టెంబర్ 25: ఉత్తర్ ప్రదేశ్‌లో భారత రక్షణరంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈరోజు (గురువారం) ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (UPITS-2025) సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత సైన్యం స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్) లక్ష్యంతో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.


'మన సైన్యం స్వయం సమృద్ధిని సాధించాలని, విదేశీ మూలాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆశిస్తోంది. ఈ లక్ష్యానికి, భారతదేశంలో బలమైన రక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి ఉత్పత్తి 'మేడ్ ఇన్ ఇండియా'గా ఉండాలని నొక్కి చెబుతున్నాం. దీనికి మద్దతుగా, ఉత్తర్ ప్రదేశ్ కీలకపాత్ర పోషిస్తోంది. రష్యా సహాయంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో AK-203 రైఫిల్స్ తయారీ త్వరలో ప్రారంభం కానుంది' అని పీఎం మోదీ చెప్పారు.


ఉత్తర్ ప్రదేశ్‌లో డిఫెన్స్ కారిడార్ అభివృద్ధి చేస్తున్నామని.. ఇక్కడ బ్రహ్మోస్ మిస్సైళ్లు, ఇతర ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే జరుగుతోందని మోదీ చెప్పారు. ఇందులో భాగంగానే UPITS-2025, 'అల్టిమేట్ సోర్సింగ్ బిగిన్స్ హియర్' అనే థీమ్‌తో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు ఈ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు.

I.jpgఇది ఆవిష్కరణ, సమైక్యత, అంతర్జాతీయీకరణపై దృష్టిపెడుతూ.. విదేశీ కొనుగోలుదారులు, దేశీయ B2B, B2C కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైవిధ్యమైన, ఆధునిక పరిశ్రమలు, MSMEలు, కొత్త ఆర్థికవ్యవస్థలను సృష్టించబోతున్నాయని మోదీ అన్నారు. ఈ అభివృద్ధి భారత రక్షణ రంగంలో స్వదేశీ తత్వాన్ని బలపరుస్తూ, ఉత్తర్ ప్రదేశ్‌ను డిఫెన్స్ హబ్‌గా మార్చనుందని ప్రధాని చెప్పారు. దేశ ఆర్థిక, రక్షణ లక్ష్యాలకు ఇది మరో మైలురాయిగా మోదీ అభివర్ణించారు.


ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసాదారుల్లో 80 శాతం మాయం.. అమెరికన్లకు ఇదే ఛాన్స్.. నెటిజన్ పోస్టుపై నెట్టింట డిబేట్

యూపీఐ అంటే ఇదీ.. పోయిందనుకున్న ఫోన్ దొరకడంతో సంబరపడ్డ జంట

Updated Date - Sep 25 , 2025 | 03:47 PM