PM Modi: ఢిల్లీ బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన మోదీ
ABN , Publish Date - Sep 29 , 2025 | 06:30 PM
బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు కాగా, ప్రస్తుతం పండిట్ పంత్ మార్గ్ నుంచి పని చేస్తు్న్న ఢిల్లీ బేజీపీ కార్యాలయం ఇక నుంచి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్ నుంచి పనిచేయనుంది.
న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. దీన్ దయాళ్ మార్గ్‌లో కొత్తగా నిర్మించిన ఢిల్లీ బీజేపీ కార్యాలయాన్ని (Delhi BJP New Office) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారంనాడు ప్రారంభించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్, పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ కొత్త కార్యాలయం ఏర్పాటు కాగా, ప్రస్తుతం పండిట్ పంత్ మార్గ్ నుంచి పని చేస్తున్న ఢిల్లీ బేజీపీ కార్యాలయం ఇక నుంచి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మార్గ్ నుంచి పనిచేయనుంది. ఇప్పటి వరకూ అద్దెకుండటం, తాత్కాలిక కార్యాలయాల్లో పని చేసిన బీజేపీ కార్యాలయానికి ఇప్పుడు సొంత కార్యాలయం రావడం, అదికూడా నవరాత్రి రోజుల్లో ప్రారంభం కావడం పార్టీ శ్రేణుల్లో సంబరాలు నింపింది.
బీజేపీ కొత్త కార్యాలయాన్ని 825 చదరుపు మీటర్ల ప్లాట్‌లో 5 అంతస్తులతో నిర్మించారు. వాహనాల పార్కింగ్ కోసం రెండు బేసమెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఎకో-ఫ్రెండీ, అధునాతన సౌకర్యాలతో కార్యాలయాన్ని డిజైన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కాన్ఫరెన్స్ రూమ్, రెసెప్షన్ ఏరియా, కాంటిన్, 300 సీట్ల సామర్థ్యం కలిగిన ఆడిటోరియం ఏర్పాటు చేసారు. రెండో అంతస్తులో పార్టీ సెల్స్, సిబ్బందికి వసతి కల్పించారు. మూడో ఫ్లోర్ పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలకు కేటాయించారు. టాప్ ఫ్లోర్‌ను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)కు రిజర్వ్ చేశారు. ఢిల్లీ ఎంపీలు, రాష్ట్ర స్థాయి ఇన్‌చార్జి నేతలకు రూములు కేటాయించారు. రూ.2.23 కోట్ల వ్యయంతో కొత్త కార్యాలయ నిర్మాణం జరిగింది.
ఇవి కూడా చదవండి..
మూడేళ్లలో రూ.241 కోట్లు సంపాదించా.. జన్ సురాజ్ నిధులపై పీకే
For More National News And Telugu News