PM Modi: దుర్గా మండపాల్లో పూజలు చేసిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Sep 30 , 2025 | 09:05 PM
ఢిల్లీలోని మీనీ బెంగాల్‌గా చిత్తరంజన్ పార్క్ ప్రసిద్ధి చెందింది. బెంగాలీ సంప్రదాయ రీతిలో ఇక్కడ ఏటా ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు జరుగుతుంటాయి. భారీ మండపాలు, ఫుడ్ స్టాల్స్, సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
న్యూఢిల్లీ: దుర్గా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారంనాడు ఢిల్లీలోని సీఆర్ పార్క్ వద్దనున్న కాలి బరి ఆలయ దుర్గా పూజా మండపాన్ని సందర్శించారు. అష్టమి సందర్భంగా అమ్మవారిని దర్శించి పూజలు జరిపారు. అనంతరం మరో మండపాన్ని కూడా ఆయన దర్శించారు. ప్రధాని వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా పాల్గొన్నారు.

ఢిల్లీలోని మినీ బెంగాల్‌గా చిత్త రంజన్ పార్క్ ప్రసిద్ధి చెందింది. బెంగాలీ సంప్రదాయ రీతిలో ఇక్కడ ఏటా ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు జరుగుతుంటాయి. భారీ మండపాలు, ఫుడ్ స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. నగరంలోని వేలాది మంది ఈ మండపాలను దర్శించి పూజల్లో పాల్గొంటారు. ఈ ఏడాది దుర్గా పూజ సెప్టెంబర్ 28న (షష్టి) ప్రారంభమైంది. అక్టోబర్ 2వ తేదీ విజయదశమితో ఈ వేడుకలు ముగుస్తాయి.
ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని మోదీ రాక సందర్భంగా సీఆర్ పార్క్, గ్రేటర్ కైలాస్-2కు చేరుకునే రోడ్లపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ గ్రేటర్ కైలాస్-2 వెల్ఫేర్ అసోసియేషన్ అడ్వయిజరీ జారీచేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. గురుద్వార రోడ్, బిపిన్ చంద్ర పాల్ మార్క్‌తో రెండు ప్రాంతాలకు చెందిన అంతర్గత రోడ్లలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఆంక్షల సమయంలో ఎంపీ రోడ్, అరబిందో మార్క్, మధుర రోడ్, లాలా లజపతి రాయ్ రోడ్డు, మెహ్రౌలి-బదర్‌పూర్ రోడ్లను ఉపయోగించుకోవాల్సిందిగా ప్రయాణికులకు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి