Home » New Delhi
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సాధ్యమైనంత త్వరగా ఎస్ఐఆర్ను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున తొలి విడత ఎస్ఐఆర్లో ఆ రాష్ట్రాలు చోటుచేసుకోనున్నాయి.
దీపావళి సందర్భంగా న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ జంక్షన్‌తో సహా పలు ప్రధాన స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నార్తరన్ రైల్వే అదనపు టిక్కెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలో భద్రతా చర్యలను కూడా పెంచింది.
ఇది పండుగల సీజన్ అని ప్రధాని మోదీ పేర్కొంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి తరుణంలో 'అన్‌స్టాపబుల్ భారత్' పేరుతో ప్రపంచ సదస్సు ఏర్పాటు చేయడం సందర్భానికి తగినట్టుగా ఉందని, ఇండియా ఎక్కడా అగకుండా ముందుకు సాగే మూడ్‌లోనే ఉందని చెప్పారు.
ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని తనపై అత్యాచార యత్నం జరిగిందని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రైతుల ఆదాయం పెంచేందుకు, పంటల సాగు వ్యయం తగ్గించేందుకు గత పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని మోదీ చెప్పారు. యూపీఏ పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చిందన్నారు.
విజయ్ తరఫున న్యాయవాదులు దీక్షిత గోహిల్, ప్రాంజల్ అగర్వాల్, ఎస్ విజయ్‌లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 10న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఇదే కేసుకు సంబంధించి మరో పిటిషన్ కూడా అడ్వకేట్ జీఎస్ మణి దాఖలు చేశారు.
నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలతో దేశాన్ని ముందుకు నడిపించే యువశక్తిని సన్నద్ధం చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్యంతో ఉందని ప్రధాని మోదీ అన్నారు.
రూ.100 నాణెంపై ఒకవైపు జాతీయ చిహ్నం (National Emblem) ముద్రించగా, మరోవైపు భరతమాత వరదముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు.
ఢిల్లీలోని మీనీ బెంగాల్‌గా చిత్తరంజన్ పార్క్ ప్రసిద్ధి చెందింది. బెంగాలీ సంప్రదాయ రీతిలో ఇక్కడ ఏటా ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు జరుగుతుంటాయి. భారీ మండపాలు, ఫుడ్ స్టాల్స్, సంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు.
యావత్ ప్రపంచంలో వివిధ రకాల పూలతో ప్రకృతిని పూజించే ఏకైక పండుగ మన బతుకమ్మ.. అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ బిడ్డలందరీ జీవితాల్లో వెలుగు నింపేదని పేర్కొన్నారు.