Nitin Nabin: అభివృద్ధి భారత్ దిశగా పార్టీని పటిష్టం చేస్తా: నితిన్ నబీన్
ABN , Publish Date - Dec 15 , 2025 | 09:21 PM
పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నబీన్ మాట్లాడుతూ, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, తనపై నమ్మకం ఉంచిన పార్లమెంటరీ పార్టీకి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక ఉధ్యక్షుడు (BJP National Wroking President)గా నితిన్ నబీన్ (Nitin Nabin) పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారంనాడు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా తదితర పార్టీ ప్రముఖులు ఈ సందర్భంగా హాజరయ్యారు. నితిన్ నబీన్‌ను సన్మానించారు. దీనికి ముందు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నబీన్‌కు ముఖ్యమంత్రి రేఖాగుప్తా, పలువురు పార్టీ నేతలు సాదర స్వాగతం పలికారు.
పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నబీన్ మాట్లాడుతూ, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, తనపై నమ్మకం ఉంచిన పార్లమెంటరీ పార్టీకి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ కార్యకర్తలను కలుపుకొంటూ వెళ్తానని, పూర్తి శక్తిసామర్ధ్యాలతో సంస్థను మరింత పటిష్టం చేస్తానని, అద్భుతమైన ఫలితాల దిశగా పార్టీని నడిపించేందుకు కట్టుబడి ఉన్నానని నబీన్ చెప్పారు. సేవ, సంస్థ, అంకితభావం అనే మార్గంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లి 'అభివృద్ధి భారత్' సాధించగలమనే నమ్మకం తనకు ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
పహల్గాం ఉగ్రదాడి ప్రధాని సూత్రధారి సాజిద్ జాట్.. ఎన్ఐఏ ఛార్జిషీట్..
నితిన్ నబీన్‌ను పార్టీ చీఫ్‌గా ప్రకటించక పోవడం వెనుక బీజేపీ వ్యూహం ఇదే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి