Share News

Australia Shooting: ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పులు ఫుల్ వీడియో..

ABN , Publish Date - Dec 14 , 2025 | 08:16 PM

ఆస్ట్రేలియాలోని బాండి బీచ్‌లో ఉగ్రమూక జరిపిన దాడిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఉగ్రవాదం పట్ల భారతదేశానికి ఏమాత్రం సహనం లేదని, ఉగ్రవాదపు అన్ని రూపాలు.. ప్రదర్శనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాము మద్దతిస్తామని భారత ప్రధాని..

Australia Shooting: ఆస్ట్రేలియా బీచ్‌లో కాల్పులు ఫుల్ వీడియో..
Australia Shooting

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 14: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో ఉగ్రమూక ఇవాళ(ఆదివారం) జరిపిన కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో యావత్ ప్రపంచం స్పందిస్తోంది. కాల్పుల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులు బాధితులకు తమ సంఘీభావం తెలుపుతున్నారు. కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ, భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ సోషల్ మీడియాలో స్పందించారు.


'హనుక్కా పండుగ మొదటి రోజును జరుపుకుంటున్న యూదులను లక్ష్యంగా చేసుకుని, ఆస్ట్రేలియాలోని బాండి బీచ్‌లో ఈ రోజు జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశ ప్రజల తరపున, తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో మేము ఆస్ట్రేలియా ప్రజలకు సంఘీభావంగా నిలబడతాం. ఉగ్రవాదం పట్ల భారతదేశానికి ఏమాత్రం సహనం లేదు. ఉగ్రవాదపు అన్ని రూపాలు.. ప్రదర్శనలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి తాము మద్దతిస్తాం. అని భారత ప్రధాని నరేంద్రమోదీ తన సందేశంలో పేర్కొన్నారు.


అటు, భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత, మృతుల కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తపరిచారు.


ఆస్ట్రేలియా ప్రధాని దిగ్భ్రాంతి

కాగా, బాండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బానీజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి దృశ్యాలు షాకింగ్‌గా, దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని చెప్పారు. పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్‌తో, న్యూ సౌత్ వేల్స్ (NSW) ప్రీమియర్‌తో మాట్లాడానని, NSW పోలీసులతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. మరిన్ని వివరాలు.. ధృవీకరించిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.


ఆ ప్రాంతంలో ఉన్నవారు NSW పోలీసు సూచనలను పాటించాలని ఆస్ట్రేలియా ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ దాడిని ఉగ్రవాద దాడిగా ప్రకటించి, దర్యాప్తును వేగవంతం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 08:24 PM