Vote Chori Rally: ఓట్ చోరీ ద్రోహులను గద్దె దింపాలి.. మల్లికార్జున్ ఖర్గే
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:23 PM
దేశాన్ని తుదముట్టించడమే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అని ఖర్గే విమర్శించారు. బెంగళూరులో తన కుమారునికి ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ తాను వెళ్లలేదని, ర్యాలీకి హాజరయ్యేందుకు ఇక్కడే ఉండిపోయానని చెప్పారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP)పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ చోరీకి పాల్పడేవారు ద్రోహులని, ఓటింగ్ హక్కులను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే అలాంటి వారిని అధికారం నుంచి తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు నిర్వహించిన 'ఓట్ చోర్ గద్దీ ఛోడ్' మెగా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దేశాన్ని కాపాడగలదని చెప్పారు. సమష్టిగా కాంగ్రెస్ సిద్ధాంతాన్ని బలపరచాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపైనా ఉందని అన్నారు.
దేశాన్ని తుదముట్టించడమే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అని ఖర్గే విమర్శించారు. బెంగళూరులో తన కుమారునికి ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ తాను వెళ్లలేదని, ర్యాలీకి హాజరయ్యేందుకు ఇక్కడే ఉండిపోయానని చెప్పారు. 140 కోట్ల ప్రజలను కాపాడటమే తన ప్రాధాన్యతగా భావించినట్టు తెలిపారు.
బీజేపీ నేతలు కేవలం డ్రామాలు చేస్తుంటారని, కొందరయితే పార్లమెంటు సమావేశాలప్పుడు, అయిన తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తుంటారంటూ ప్రశ్నిస్తుంటారని, అయితే పార్లమెంటు సమావేశం జరుగుతున్నప్పుడు మోదీ పార్లమెంటు సెషన్లలో పాల్గొనలేదని, విదేశాలకు వెళ్లారని చెప్పారు. 'ఓట్ చోరీ తర్వాత వారు అధికారంలో కూర్చున్నాను. ఈ ద్రోహులను అధికారం నుంచి తొలగించాల్సి ఉంది' అని ఖర్గే తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కారణమిదే.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి