Share News

Vote Chor Gaddi Chhod: ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా

ABN , Publish Date - Dec 14 , 2025 | 03:18 PM

ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ఓట్ చోర్, గద్దీ ఛోడ్ మహాధర్నా ప్రారంభమైంది. ఎన్నికల్లో అవకతవకలపై బీజేపీ, ఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ భారీ ధర్నా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు..

Vote Chor Gaddi Chhod: ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా
Ramleela Maidan Delhi

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 14: ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' మహా ధర్నా ప్రారంభమైంది. ఎన్నికల్లో ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు, ఈసీ-బీజేపీ కుమ్మక్కు ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఈరోజు (ఆదివారం మధ్యాహ్నం) ఈ మహా ధర్నా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' నినాదంతో జరిగిన ర్యాలీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితర జాతీయ నేతలు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, జిల్లా నేతలు, వేలాది కార్యకర్తలు హాజరయ్యారు.


తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు పాల్గొన్నారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ ధర్నాలో పాలుపంచుకుంటున్నారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల్లో బోగస్ ఓట్లు జోడించడం, ప్రతిపక్షాలకు మద్దతిచ్చే ఓటర్లను తొలగించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా 5.5 కోట్లకు పైగా సంతకాలు సేకరించినట్టు పార్టీ తెలిపింది.


ఈ మహా ధర్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేపట్టిన పోరాటమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ర్యాలీలో భారీ జన సమూహాన్ని పాల్గొనేలా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ప్రదర్శించింది. ఈ ధర్నా ద్వారా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కోరుతూ కాంగ్రెస్ గట్టి సందేశం ఇవ్వాలని నిర్ణయించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 04:27 PM