Home » New Delhi
ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో అరెస్టైన లఖ్నవూ డాక్టర్ షాహీన్‌కు భారత్‌లో మహిళా ఉగ్రవాదుల నాయకత్వ బాధ్యతలను పాక్ ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ అప్పగించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్-1 సమీపంలో పేలుడు ఘటనలో పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 10 మంది మరణించగా మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్‌లో పోలీసులు హైలర్ట్ ప్రకటించారు.
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు వెల్లడయ్యాయి. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు జరుగుతాయని సంబంధిత శాఖా మంత్రి కిరణ్ రిజిజూ తెలిపారు.
న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళన్-2025ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ పేరును ప్రత్యేకించి ప్రస్తావించారు.
ఉపఎన్నికలు జరుగనున్న వార్డుల్లో ముండ్కా, షాలిమార్ మార్గ్-బి, అశోక్ విహార్, చాందినీ చౌక్, చాందినీ మహల్, ద్వారకా-బి, డిచావు కలాన్, నారాయణ, సంగమ్ వివార్-ఎ, దక్షిణ్ పూరి, గ్రేటర్ కైలాష్, వినోద్ నగర్ ఉన్నాయి.
గ్రౌండ్ హ్యాండిలర్స్‌కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్‌ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో తెలియజేసింది.
దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాలలో సవరణలకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టబోతోంది. అధికారిక ప్రకటన ఈ సాయంత్రం వెలువడే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాలలో అనర్హులైన ఓటర్లను తొలగించడం, నిజమైన ఓటర్లను మాత్రమే జాబితాలో ఉంచడానికి..
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో సాధ్యమైనంత త్వరగా ఎస్ఐఆర్‌ను పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున తొలి విడత ఎస్ఐఆర్‌లో ఆ రాష్ట్రాలు చోటుచేసుకోనున్నాయి.
దీపావళి సందర్భంగా న్యూఢిల్లీ, ఆనంద్ విహార్, హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ జంక్షన్‌తో సహా పలు ప్రధాన స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నార్తరన్ రైల్వే అదనపు టిక్కెట్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్లలో భద్రతా చర్యలను కూడా పెంచింది.
ఇది పండుగల సీజన్ అని ప్రధాని మోదీ పేర్కొంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి తరుణంలో 'అన్‌స్టాపబుల్ భారత్' పేరుతో ప్రపంచ సదస్సు ఏర్పాటు చేయడం సందర్భానికి తగినట్టుగా ఉందని, ఇండియా ఎక్కడా అగకుండా ముందుకు సాగే మూడ్‌లోనే ఉందని చెప్పారు.