Share News

Jagdeep Dhanakar: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన జగదీప్ ధన్‌ఖఢ్

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:59 PM

ధన్‌ఖఢ్ ఈనెల 10న వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు రెండు సార్లు స్పృహ కోల్పోయారని, వైద్య పరీక్షలు జరపాలని వైద్యులు సూచించడంతో చెకప్‌ కోసం ఎయిమ్స్‌లో చేరారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Jagdeep Dhanakar: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన జగదీప్ ధన్‌ఖఢ్
Jagdeep Dhankar

న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్‌ (Jagdeep Dhankar) అస్వస్థతతో సోమవారంనాడు ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (AIIMS)లో చేరారు. ఆయనకు ఎంఆర్ఐ (MRI) పరీక్షలు నిర్వహిస్తున్నారు.


ధన్‌ఖఢ్ ఈనెల 10న వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు రెండు సార్లు స్పృహ కోల్పోయారని, వైద్య పరీక్షలు జరపాలని వైద్యులు సూచించడంతో చెకప్‌ కోసం ఎయిమ్స్‌లో చేరారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఢిల్లీ, ఉత్తరాఖండ్, కేరళ తదితర ప్రాంతాల్లో జరిగిన పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ స్పృహతప్పిన సందర్భాలు ఉన్నాయి.


అనారోగ్య కారణాలతో గత ఏడాది జూలైలో అకస్మాత్తుగా జగదీప్ ధన్‌ఖడ్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు ఈ పరిణామం చోటుచేసుకోవడం పలు రాజకీయ ఊహాగానాలకు దారితీసింది. వైద్యుల సలహాల మేరకు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాను రాజీనామా చేస్తున్నానని, రాజ్యాంగంలోని 67(ఎ) నిబంధన కింద తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.


ఇవి కూడా చదవండి..

ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 12 , 2026 | 06:02 PM