Share News

PM Modi kite flying: పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:37 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ పతంగుల పండుగను ప్రారంభించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదీ తీరంలో ప్రధాని సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో ప్రధాని మోదీతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కూడా పాల్గొన్నారు.

PM Modi kite flying: పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్
Prime Minister Modi kite flying

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ పతంగుల పండుగను ప్రారంభించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి నదీ తీరంలో ప్రధాని సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలో ప్రధాని మోదీతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కూడా పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి పతంగులను ఎగురవేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్‌లో కలియతిరిగారు (PM Modi festive celebrations).


ఈ ఉత్సవంలో 50 దేశాలకు చెందిన ఔత్సాహికులు పాలుపంచుకున్నారు (kite flying tradition Modi). ఈ వేడుకలో హనుమాన్ పతంగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది ఈ ఫెస్టివల్‌కు 3.83 లక్షల మంది సందర్శకులు హాజరయ్యారు. ఈ ఏడాది సందర్శకులు సంఖ్య 5 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇంటి ఖర్చుల లెక్కలు అడిగిన భర్తపై కేసు.. సుప్రీం కోర్టు తీర్పు ఏంటంటే..


మూడు పాములతో హాస్పిటల్‌కు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Updated Date - Jan 12 , 2026 | 01:37 PM