Home » National News
ప్రాథమిక సమాచారం ప్రకారం, నిర్మలా గావిత్ సోమవారం సాయంత్రం నాసిక్‌లోని తన నివాసం వెలుపల వాకింగ్ చేస్తుండగా వేగంగా దూసుకువచ్చిన కారు వెనక వైపు నుంచి ఢీకొంది.
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న పలువురు బీఎల్ఓలు తీవ్రమైన పనిభారం, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మూడు వారాల్లో 16 మంది మరణించినట్టు కథనాలు రావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది.
క్లోరిన్ గ్యాస్ లీక్ సమాచారంతో అగ్నిమాక సిబ్బంద ఘటనా స్థలికి చేరుకున్నారు. వారు ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజీని నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.
మొఘలుల హయాంలో తేగ్ బహదూర్ ఎంతో సాహసం చూపించారని, కశ్మీరీ పండిట్లను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేస్తుంటే దానిని వ్యతిరేకించి, కశ్మీరీ హిందువులకు అండదండగా నిలిచారని గుర్తుచేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియను ఇంత హడావిడిగా చేపట్టటాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. హడావిడి వ్యవహారంతో ఓటర్ల జాబితా నుంచి ప్రజలను తప్పించాలని చూస్తే బీజేపీని విడిచిపెట్టేది లేదని అన్నారు.
డిఫెన్స్ కారిడార్, సెమికండక్టర్ తయారీ పార్క్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, మెగా టెక్ సిటీ, ఫిట్నెస్ సిటీ ఏర్పాటుతో బీహార్‌ను ఈస్ట్రన్ ఇండియా టెక్ హబ్‌గా తయారు చేయాలని మంత్రివర్గ మావేశంలో నిర్ణయించినట్టు సీఎస్ తెలిపారు.
సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని మోహన్ భాగవత్ అన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని పేర్కొన్నారు.
రామభక్తుల సంకల్పం సిద్ధించిందని.. అయోధ్య రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ధర్మ ధ్వజం కేవలం జెండా కాదని.. భారత సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమని కొనియాడారు. అయోధ్య రామమందిరంలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
పార్టీ మౌలిక సిద్ధాంతాలు, ప్రవర్తనా నియమావాళికి భిన్నంగా ఈ నేతలు పార్టీ వెలుపల వేదికలపై తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీపీసీసీ పేర్కొంది.
ఈసారి ఫిరాయింపుదారులను పార్టీలోకి చేర్చుకునే ఆలోచన బీజేపీకి అంతగా లేదని అంటున్నారు. బెంగాల్లో తమ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని బీజేపీ భావిస్తుండటమే ఇందుకు కారణం.