భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:35 PM
ప్రధాని నరేంద్రమోదీ మలేషియాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీంతో మోదీ చర్చలు జరిపారు.
ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) మలేషియాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మలేషియా ప్రధాని ఇబ్రహీంతో చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్-మలేషియా మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవని వ్యాఖ్యానించారు.
టూరిజంలో పరస్పర సహకారం..
డిజిటల్, బయోటెక్, ఐటీలో పరస్పర పెట్టుబడులు పెరిగాయని వివరించారు. టూరిజంలో పరస్పర సహకారం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీల్లో పరస్పర సహకారంపై ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. సెమీకండక్టర్లు, ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో ఒప్పందాలు జరిగాయని వివరించారు. ఉగ్రవాద నిర్మూలనకు రెండు దేశాలు కలిసి సంయుక్తంగా పనిచేస్తాయని ప్రకటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ప్రపంచ వృద్ధి, వాణిజ్యానికి ఇండో-పసిఫిక్ ప్రాంతం కీలకమని చెప్పుకొచ్చారు.
ఉగ్రవాదంపై రాజీ పడే ప్రసక్తే లేదు..
ఈ వేదికగా ఉగ్రవాదం మీద పోరుపై భారత్ వైఖరిని మరోసారి ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మీద పోరుపై భారతదేశ సందేశం స్పష్టంగా ఉందని తెలిపారు. ద్వంద్వ ప్రమాణాలు లేవని.. రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అరికట్టడం, నిఘా భాగస్వామ్యం, సముద్ర భద్రతలో భారత్ - మలేషియా మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్రంపై పిచ్చి ప్రేలాపనలు మానుకో.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి వార్నింగ్
వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..
Read Latest Telangana News And AP News And Telugu News