కుప్పకూలిన ప్రైవేటు చార్టర్డ్ విమానం
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:58 PM
రెడ్‌బర్డ్ ఏవియేషన్ ప్రైవేటు శిక్షణా విమానం ఆదివారం నాడు కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లాలో కుప్పకూలింది. కలబురగి నుంచి బెలగావి వెళ్తుండగా..
బెంగళూరు: రెడ్‌బర్డ్ ఏవియేషన్ (Redbird Aviation) ప్రైవేటు శిక్షణా విమానం ఆదివారం నాడు కర్ణాటకలోని విజయపుర జిల్లాలో కుప్పకూలింది. కలబురగి నుంచి బెలగావి వెళ్తుండగా ఇంజన్ విఫలం కావడంతో బబలేశ్వర్ తాలూకా మంగళూరు పంటపొలాల్లో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో కెప్టెన్, ట్రైనీ పైలట్ మాత్రమే ఉన్నారు.
విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో లోపం తలెత్తడంతో దాన్ని సరిచేందుకు కెప్టెన్, ట్రైనీ పైలట్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పొలాల్లో అత్యవసర ల్యాండింగ్ జరిగే సమయంలో విమానం బలంగా నేలకు తాకడం, వారిరువురూ బయటకు విసిరివేయబడటంతో గాయపడ్డారు. పెద్దఎత్తున దుమ్ము, శకలాలు ఎగసిపడటంతో స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన పైలట్, కెప్టెన్‌ను 108 అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. విజయ్‌పుర ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్‌లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఎప్‌స్టీన్‌ను ఆయన ఎప్పుడూ కలవలేదు.. దలైలామా కార్యాలయం ఖండన
గొగోయ్‌కు పాక్ ఏజెంట్‌తో సంబంధాలు.. అసోం సీఎం సంచలన ఆరోపణ