ఉరి ‘రీల్’ చేయబోతూ.. తాడు బిగిసి మహిళ మృతి
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:46 AM
ఉరివేసుకోవడాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వీడియో రూపంలో పోస్టు చేయడానికి ప్రయత్నించిన ఓ మహిళ నిజంగానే ప్రాణాలు కోల్పోయింది...
లఖ్‌నవూ, ఫిబ్రవరి 7: ఉరివేసుకోవడాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వీడియో రూపంలో పోస్టు చేయడానికి ప్రయత్నించిన ఓ మహిళ నిజంగానే ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన 27 ఏళ్ల వివాహిత ఉరిశిక్షను రీల్‌గా చిత్రీకరించడానికి స్వయంగా నటించాలని నిర్ణయించుకొంది. ఇంట్లోనే కొక్కానికి తాడు కట్టింది. స్టూల్ ఎక్కి తాడును మెడకు బిగించుకొంది. అయితే పొరపాటున స్టూల్‌పై బ్యాలెన్స్ కోల్పోవడంతో సెకన్ల వ్యవధిలోనే తాడు బిగుసుకొని ప్రాణాలు కోల్పోయింది.
ఈ వార్తలూ చదవండి:
లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్