Home » National News
భారత వాయుసేనను మరింత బలోపేతం చేసే దిశగా 114 రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 (జీఈసీ 3) స్కీం భారతదేశ ప్రజలతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకూ భారీగా లాభాలు తెచ్చిపెడుతుందని యూఎన్ క్లైమేట్ చీఫ్ సైమన్ స్టీల్ అన్నారు.
ఈత సరదా 8 మంది ప్రాణాలను బలి తీసుకుంది. సముద్రంలో సరదాగా ఈత కొడుతున్న విద్యార్థులు ఒక్కసారిగా అలలకు కొట్టుకుపోయారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
సరదాగా సాగాల్సిన విహారయాత్రలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పుణె నుంచి పిక్నిక్‌కు వెళ్లిన విద్యార్థుల్లో 8 మంది సముద్రంలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.
విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. పని వేళల్లోనే గాఢంగా నిద్రపోతూ కనిపించారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీరంతా ఒకప్పుడు అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన వారు.. ఇప్పుడు చేతిలో పెన్నులు పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన మాజీ మావోయిస్టులు విద్య ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.
స్మిత్ మచ్చార్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. 31 వేల అడుగుల ఎత్తులో నడుస్తున్న విమానంలో దుండగుడితో వీరోచితంగా పోరాడిన మచ్చార్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా తదితర దేశాల అధినేతలు కూడా ఆయన ధైర్యసాహసాలను కొనియాడారు.
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన తొమ్మిది మంది బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొంగాయిగావ్ జిల్లాలోని న్యూ బొంగాయిగావ్ రైల్వే స్టేషన్‌లో 9 మంది బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు.