ఏపీ నుంచి తెలంగాణకు 408 కోట్లు రావాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:12 AM
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని హైకోర్టు, రాజ్‌భవన్ వంటి ఉమ్మడి రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థల నిర్వహణ కోసం చేసిన...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లోని హైకోర్టు, రాజ్‌భవన్ వంటి ఉమ్మడి రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థల నిర్వహణ కోసం చేసిన ఖర్చుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ. 408.48 కోట్లు రీయింబర్స్‌మెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని కేంద్రం తెలిపింది. ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.