Share News

నరవణే పుస్తకం విడుదలకు ముందే లీక్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

ABN , Publish Date - Feb 09 , 2026 | 09:57 PM

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం విడుదలకు ముందే వివిధ సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. స్పెషల్ సెల్ విభాగంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నరవణే పుస్తకం విడుదలకు ముందే లీక్.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
MM Naravane

న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే (MM Naravane) రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' (Four Stars of Destiny) పుస్తకం విడుదలకు ముందే వివిధ సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. స్పెషల్ సెల్ విభాగంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పుస్తకం ప్రచురణకు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు రాలేదని తెలిపారు.


'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' అనే టైటిల్‌తో టైపు చేసిన పీడీఎఫ్ కాపీలు కొన్ని వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆ డాక్యుమెంట్ ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసినట్టు కనిపిస్తోంది. కొన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ వేదికలు ఈ పుస్తకం ముఖచిత్రాన్ని ప్రదర్శించడంతో పాటు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్టు చూపిస్తున్నాయి.


అధికారుల ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న పుస్తకంలోని సమాచారాన్ని వాడుకోవడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని అధికారులు చెప్పారు. కాపీ రైట్ ఉల్లంఘన, అక్రమ పంపిణీ, లీకేజ్ వెనుక ఎవరున్నారో కోణాల నుంచి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

'సర్' ప్రక్రియలో అడ్డంకులు కల్పించవద్దు.. సుప్రీంకోర్టు

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం

Updated Date - Feb 09 , 2026 | 10:57 PM