Home » National News
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, దేవి అహల్య, నిషదరాజు గుహుడు, శబరి మాత మందిరాలతో కూడిన సప్తమందిర్‌ను దర్శిస్తారు. 11 గంటలకు శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ మందిరాలను దర్శించుకుంటారు.
ఇక్కిస్ చిత్రం 1971లో ఇండో-పాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అరుణ్ ఖేత్రపాల్ అతి చిన్న వయస్సులోనే పరమ వీర చక్ర అందుకున్నారు.
నాలుగైదు నెలల క్రితమే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం అంగీకరించిందని, అయితే ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసేంత వరకూ ఆగాల్సిందిగా తాను సూచించానని సిద్ధరామయ్య చెప్పారు.
ఆదివారంనాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఈ పదవిలో కొనసాగనున్నారు.
సింధ్ హిందువులు ముఖ్యంగా ఎల్కే అడ్వాణీ వంటి నేతల తరానికి చెందిన వారని, ఇండియా నుంచి సింధ్ ప్రాంతం విడిపోవడాన్ని సింధ్ హిందువులు ఇప్పటికీ అంగీకరించడం లేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 20వ తేదీతో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2023లో కుదిరినట్టు చెబుతున్న ఒక ఒప్పందం ప్రకారం తక్కిన రెండున్నరేళ్ల పాలన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
ఎస్ఐఆర్ ప్రక్రియ దేశంలో అలజడి రేపిందని, ప్రజాస్వామ్యానికి తిలోదకాలు వదిలి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాసేందుకు ఉద్దేశించిన ప్రక్రియ అని రాహుల్ ఆరోపించారు.
అభివృద్ధి అన్నదే తమ ప్రధాన ఎజెండా అని అజిత్ పవార్ చెప్పారు. అదే విషయాన్ని తాను ఎన్నికల ప్రచారంలో చెప్పానని, పని చేయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని, విమర్శలకు కాదని అన్నారు.
బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు.