సూరజ్‌కుండ్ మేళాలో విషాదం.. స్వింగ్ కూలి పలువురికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 08:51 PM
హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరుగుతున్న సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళాలో శనివారంనాడు రెండు షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహా సుమారు పది మంది గాయపడ్డారు.
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరుగుతున్న సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా (Surajkund International Crafts Mela)లో శనివారంనాడు రెండు షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ సహా సుమారు పది మంది గాయపడ్డారు. దీంతో ఉన్నతాధికారులు, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టారు.
థ్రిల్లింగ్ రైడ్ హారర్..
తొలుత 'సునామీ స్వింగ్' అకస్మాత్తుగా కుప్పకూలడంతో అందులో రైడ్ చేస్తున్న పలువురు కిందపడ్డారు. సుమారు 7 నుంచి 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కాపాడేందుకు ప్రయత్నించిన ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని ప్రమాదాలకు తావీయకుండా ఘటనా స్థలి వద్ద ఆధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కూలిపోయిన ప్రవేశద్వారం
స్వింగ్ కుప్పకూలిన ఘటనకు కొద్ది నిమిషాల తర్వాత 'గేట్ నెంబర్-2' సమీపంలోని స్వాగత ద్వారం కూలిపోవడంతో మేళాలో పాల్గొనేందుకు వచ్చిన ఇద్దరు గాయపడ్డారు. జిల్లా డిప్యూటీ కమిషనర్, పోలీస్ కమిషనర్, సీనియర్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా లోపాలపై విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు