Share News

ఆయన మృతిపై అనుమానాలున్నాయి.. అజిత్ పవర్ మేనల్లుడు రోహిత్ పవార్

ABN , Publish Date - Feb 07 , 2026 | 09:39 PM

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలున్నాయని ఆయన మేనల్లుడు, ఎన్‌సీపీ (ఎస్‌పీ)నేత రోహిత్ పవార్ అన్నారు.

ఆయన మృతిపై అనుమానాలున్నాయి.. అజిత్ పవర్ మేనల్లుడు రోహిత్ పవార్
Rohit pawar, Ajit Pawar

పుణె: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలున్నాయని ఆయన మేనల్లుడు, ఎన్‌సీపీ (ఎస్‌పీ)నేత రోహిత్ పవార్ (Rohit Pawar) అన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 10న వివరణాత్మక ప్రెజెంటేషన్ (Detailed Presentaion) ఇవ్వనున్నట్టు చెప్పారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా బారామతిలో శనివారంనాడు ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌సీపీ వర్గాలు విలీనం కావాలని అజిత్ పవార్ అభిలషించారని, ఆ ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. అహల్యానగర్ జిల్లా కర్జాత్‌-జామ్‌ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి రోహిత్ పవార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


'ప్రతి ఒక్కరికీ అనుమానాలు (విమాన ప్రమాదంపై) ఉన్నాయి. ఫిబ్రవరి 10న ముంబైలో దీనిపై ఒక ప్రెజెంటేషన్ ఇస్తాను. ఎందుకు ప్రమాదం జరిగింది, ఏమి జరిగి ఉండొచ్చు అనే అంశాలను ప్రస్తావిస్తాం' అని రోహిత్ పవార్ తెలిపారు. రెండు వర్గాలు కలిసి పనిచేయాలని, ఒక కుటుంబంలా ఉండాలని అజిత్ పవార్ ఎప్పుడూ కోరుకునే వారని, ఆ ప్రకారమే ఇవాళ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎన్‌సీపీ, ఎన్‌సీ కలిసి 'గడియారం' గుర్తుపై పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్రలోని 12 జిల్లా పరిషత్‌లు, 125 పంచాయతీ సమితులకు శనివారంనాడు ఎన్నికలు జరిగాయి.


ఇవి కూడా చదవండి..

మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు

Updated Date - Feb 07 , 2026 | 09:43 PM