Share News

భారత ఎగుమతులకు ఫుల్‌ జోష్‌

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:33 AM

భారత్‌ నుంచి పండ్లు, కూరగాయలు, టీ, కాఫీ, జనరిక్‌ ఔషధాలు, విమాన విడిభాగాలు, పలు రకాల వాహన విడిభాగాలు వంటివాటిపై అమెరికా సుంకాలను సున్నాకు...

భారత ఎగుమతులకు ఫుల్‌ జోష్‌

  • భారత్‌ నుంచి పండ్లు, కూరగాయలు, టీ, కాఫీ, జనరిక్‌ ఔషధాలు, విమాన విడిభాగాలు, పలు రకాల వాహన విడిభాగాలు వంటివాటిపై అమెరికా సుంకాలను సున్నాకు తగ్గించనుందని.. ఈ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరుగుతాయని పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ భారత్‌ నుంచి పెద్ద ఎత్తున విమాన విడిభాగాలను దిగుమతి చేసుకుంటుంది. సుంకాల తగ్గింపుతో ఆ సంస్థ మన దేశ సంస్థలకు భారీ స్థాయిలో ఆర్డర్లు ఇవ్వనుంది.

  • ఇక వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, ప్లాస్టిక్‌-రబ్బర్‌ ఉత్పత్తులు, బొమ్మలు, కార్పెట్లు, గృహాలంకరణ ఉత్పత్తులు, యంత్రాలు, వాటి విడిభాగాలు, రసాయనాలు, హస్తకళాకృతులు, ఫార్మా, వజ్రాలు, విలువైన రత్నాలపై సుంకాలు 18శాతానికి తగ్గడం వల్ల అమెరికాలో మన ఉత్పత్తులకు డిమాండ్‌ పెరగనుంది.

  • భారత మొత్తం వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల విలువ 2024లో రూ.4.15 లక్షల కోట్లు, 2025లో 4.61 లక్షలు కోట్లుకాగా.. వచ్చే నాలుగేళ్లలో రూ.9లక్షల కోట్ల విలువైన వ్యవసాయ, సముద్ర, ఇతర ఉత్పత్తులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈయూ, యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని భావిస్తోంది.

తగ్గనున్న హార్లీ-డేవిడ్సన్‌ బైకుల ధరలు

అమెరికాకు చెందిన ప్రముఖ హార్లీ-డేవిడ్సన్‌ బైకుల ధరలు దిగిరానున్నాయి. ప్రస్తుతం 1,600 సీసీ సామర్థ్యంలోపు ఉన్న బైకులపై 40శాతం, ఆపై సామర్థ్యమున్న వాటిపై 30ు దిగుమతి సుంకాలు ఉన్నాయి. ఇప్పుడా సుంకాలు సున్నాకు తగ్గనుండటంతో.. బైకుల ధరలు ఆ ఆమేరకు తగ్గనున్నాయి.

ఈ వార్తలూ చదవండి:

లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated Date - Feb 08 , 2026 | 06:33 AM