రాజకీయ దురుద్దేశంతోనే నాపై కేసు
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:21 AM
భారత పౌరసత్వం పొందకుండానే ఫోర్జరీ ద్వారా ఓటు హక్కు సంపాదించినట్టు తనపై రాజకీయ దురుద్దేశాలతో కేసు పెట్టారని కాంగ్రెస్ నాయకురాలు...
ఫోర్జరీతో ఓటు హక్కు పొందలేదు: సోనియా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: భారత పౌరసత్వం పొందకుండానే ఫోర్జరీ ద్వారా ఓటు హక్కు సంపాదించినట్టు తనపై రాజకీయ దురుద్దేశాలతో కేసు పెట్టారని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ శనివారం కోర్టు దృష్టికి తెచ్చారు. సంబంధంలేని కారణాలతో కేసు పెట్టినందున దాన్ని కొట్టివేయాలని కోరారు. సోనియా గాంఽధీకి 1983లో భారత పౌరసత్వం రాగా, అంతకుముందు 1980లోనే ఓటు హక్కు పొందారని దీనిపై దర్యాప్తు చేయించాలని కోరుతూ న్యాయవాది వికాస్ త్రిపాఠి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ కోర్టుకు సమాధానం ఇచ్చారు.
ఈ వార్తలూ చదవండి:
లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్