Share News

స్వీడన్‌ అందగత్తె కావాలా?

ABN , Publish Date - Feb 08 , 2026 | 06:25 AM

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ డాక్యుమెంట్లలో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీ పేరు కూడా వెలుగు చూసింది. 2017-19 మధ్య ఇరువురి మధ్య బలమైన చర్చలు, భేటీలు కూడా..

స్వీడన్‌ అందగత్తె కావాలా?

  • అలాగే.. ఏర్పాటు చేసేయ్‌!

  • అనిల్‌ అంబానీ-ఎ్‌పస్టీన్‌ల మధ్య చర్చ.. నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: జెఫ్రీ ఎప్‌స్టీన్‌ డాక్యుమెంట్లలో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీ పేరు కూడా వెలుగు చూసింది. 2017-19 మధ్య ఇరువురి మధ్య బలమైన చర్చలు, భేటీలు కూడా జరిగినట్టు ఎప్‌స్టీన్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ నివేదికలో స్వీడన్‌ అందగత్తెల గురించిన ప్రస్తావనతోపాటు బాలీవుడ్‌ భామల గురించి కూడా ఉండడం గమనార్హం. ‘‘స్వీడన్‌ అందగత్తె కావాలా?’’ అని ఎప్‌స్టీన్‌ మెసేజ్‌ చేయగా కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే అనిల్‌ అంబానీ స్పందించి.. ‘‘అలాగే, ఏర్పాటు చేసేయ్‌!.’’ అని సమాధానమిచ్చారు. అదేవిధంగా ఎప్‌స్టీన్‌పై సెక్స్‌ కుంభకోణం అభియోగాలు నమోదై.. జైలుకు వెళ్లే వరకు అనిల్‌తో 2017-19 మధ్య.. అనేక సందేశాలు కొనసాగాయి. ఇరువురు ప్రపంచ పరిణామాలు, వ్యాపారాలతోపాటు.. మహిళల గురించి విస్తృతంగా చర్చించుకున్నారు. 2017, మార్చి 9న జరిగిన సంభాషణలో ‘‘మీరు ఎవరిని సజ్జస్ట్‌ చేస్తారు?.’’ అని అనిల్‌ ప్రశ్నించగా.. ఎప్‌స్టీన్‌.. ‘‘ఓ పొడవాటి, అందమైన స్వీడిష్‌ మహిళ. ఎంతో మైమరపిస్తుంది.’’ అని బదులిచ్చారు. దీనికి కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే అనిల్‌ స్పందిస్తూ.. ‘‘ఏర్పాటు చేయ్‌!.’’ అని పేర్కొన్నారు. అంబానీ కుటుంబానికి చెందిన పలు పుస్తకాలను కూడా ఎప్‌స్టీన్‌ ఆర్డర్‌ చేయడం గమనార్హం. అదేవిధంగా 2018లో అనిల్‌-ఎప్‌స్టీన్‌లు ప్యారి్‌సలో కలుసుకోవాలని భావించారు. కానీ, ఆ పర్యటన నిలిచిపోయింది. 2019లో తాను న్యూయార్క్‌కు వస్తున్నట్టు అనిల్‌ చెప్పగా.. ఎప్‌స్టీన్‌ ఆయనను ఆహ్వానించారు. అంతేకాదు, ‘‘న్యూయార్క్‌లో మీరు రహస్యంగా ఎవరినైనా కలవాలని అనుకుంటే నాకు చెప్పండి.’’ అని ఎప్‌స్టీన్‌ వ్యాఖ్యానించారు. ఇక, ఇరువురు కూడా మన్‌హాట్టన్‌లోని ఎప్‌స్టీన్‌ ఇంట్లో భేటీ అయ్యారు.

ఈ వార్తలూ చదవండి:

లంచం కేసు! 30 ఏళ్ల పాటు పోరాటం! నిర్దోషి అని తేలిన మరుసటి రోజే..

భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్‌ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Updated Date - Feb 08 , 2026 | 06:25 AM