Home » MLA
సనత్‌నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి.
తనకన్నా చిన్నవయసు ఉన్న యువకుడి పాదాలు తాకిన బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పెద్దరికం అన్న గౌరవం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్‌రెడ్డి మరణించారని, మిస్ ఫైరింగ్ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.
అధికారులపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు.. భయపడి బతకొద్దు.. అని ఆయన అన్నారు. వరదయ్యపాలెంలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే పేరూరు ప్రాజెక్టు కాలువ పనులు ప్రారంభం అవుతాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఆమె మాట్లాడుతూ... పేరూరు ప్రాజెక్టుకు హంద్రీనీవా ద్వారా నీరు అందించే పనులకు 2018లో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు.
మన భూమిపై మన హక్కు కల్పించే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రీసర్వే చేయించి ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుసుమవారిపల్లిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 68 మంది రైతులకు రాజ ముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.
ఏపీ అభివృద్ధికి చిరునామా ముఖ్య మంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే ప ల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నతపాఠశాల వసతిగృహం నిర్మా ణానికి వారు సోమవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గిరిజన శాఖాధికారి రాజేంద్రరె డ్డి హాజరయ్యారు.
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూమి హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని డోన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ రెడ్డి పేర్కొన్నారు.