పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:12 AM
పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
బేతంచెర్ల, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): పేదల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అంబాపురం, రంగాపురం గ్రామాలతో పాటు బేతంచెర్ల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, ప్రభుత్వ చౌక దుకాణాల్లో రేషనకార్డుదారులకు స్మార్ట్ కార్డులను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం వస్తువులపై వసూలు చేసే జీఎస్టీ తగ్గింపుపై ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా బేతంచెర్ల పట్టణంలోని దుర్గమ్మ ఆలయం ఎదుట నగర కమిషనర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ డీవో ఫజిల్ రెహిమాన తదితరులు పాల్గొన్నారు.
ప్యాపిలి: పేదల మోములో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని హుశేనాపుం గ్రామంలో ఆయన సామాజిక భద్రతా పింఛన్లు, స్మార్ట్ రేషన కార్డులను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో డీసీఎంఎస్ చైర్మన వై.నాగేశ్వరరావు యాదవ్, తహసీల్దార్ భారతి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మినారాయణ యాద వ్, ఖాజాపీర్, శ్రీకాంత, రాజశేఖర్, తిమ్మారెడ్డి, దామోదర్ పాల్గొన్నారు.