Share News

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే బీవీ

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:52 AM

ఇటీ వల కలెక్టర్‌గా బాధ్య తలు స్వీకరించిన కలెక్టర్‌ ఏ సిరిని కర్నూల కలెకరేట్‌లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి శుక్రవారం కలిశారు.

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే బీవీ
కలెక్టర్‌ సిరికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఇటీ వల కలెక్టర్‌గా బాధ్య తలు స్వీకరించిన కలెక్టర్‌ ఏ సిరిని కర్నూల కలెకరేట్‌లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సహకారంతో జరుగుతున్న టెక్స్‌టైల్‌ పార్కు గురించి, ఎంఎస్‌ఎంఈలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తీసుకొచ్చే విషయమై చర్చించినట్లు తెలిపారు. అలాగే గాజులదిన్నె ప్రాజెక్టు గేట్ల మరమ్మతులతోపాటు ఇతర అభివృద్ధిపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన అధికవర్షాల వల్ల పత్తిరైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆరైతులకు సహాయం అందించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

Updated Date - Oct 04 , 2025 | 12:52 AM