Share News

MLA: ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం.. డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులు

ABN , Publish Date - Oct 01 , 2025 | 01:41 PM

డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వెంకటాపురంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

MLA: ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం.. డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులు

రామగిరి(అనంతపురం): డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Raptadu MLA Paritala Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వెంకటాపురంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. 23 మంది లబ్ధిదారులకు రూ.28.06 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... డిజిటల్‌ బుక్కుల పేరుతో అధికారులను, పోలీసులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వారు ఇలాగే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్దిచెబుతారని అన్నారు.


zzzzzzzzzzzzzzzzzzzz.jpg

అధికారంలో ఉన్న ఐదేళ్లూ బెదిరింపులు, దౌర్జన్యాలతో పాలన సాగించిన వైసీపీ ఇంకా ఆ ధోరణి మాన లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు జింకా సూర్యనారాయణ, షేక్షావలి నాయుడు, రాగేమురళీ, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, నారాయణస్వామి, శ్రీనివాసరెడ్డి, నాగేంద్రరెడ్డి, నరసింహులు, బాలరాజు, జగదీష్‌, గోపాల్‌, రవి, ఆది, ముత్యాలు, నరేష్‌, శశాంక చౌదరి, ఓబులపతి, రాజారమేష్‌, అక్కులన్న ఆనంద్‌, బాబా, తిక్కస్వామి చిరంజీవి, ఉస్మాన్‌ ఖాన్‌ పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర మరింత పెరిగింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

9 నెలల్లో 203 కేసులు.. 189 మంది అరెస్టు !

Read Latest Telangana News and National News

Updated Date - Oct 01 , 2025 | 01:41 PM