Share News

ప్రధాని మోదీ సభను జయప్రదం చేయాలి

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:13 AM

కర్నూలులో ఈనెల 16న నిర్వహించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభను జయప్రదం చేయా లని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ సభను జయప్రదం చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

ప్యాపిలి, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఈనెల 16న నిర్వహించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభను జయప్రదం చేయా లని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ విశ్రాంతి భవనంలో నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రధా ని మోదీ కర్నూలు పర్యటనకు రావడం హర్షణీయమన్నారు. ఆయన తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ హాజర వుతున్నట్లు తెలిపారు. మండలం నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. అనంతరం కోట్ల పట్టణంలో శిథిలావస్థకు చేరకున్న చెన్నకేశవస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ అభివృద్ధి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో డీసీఎంఎస్‌ చైర్మేన నాగేశ్వరరావుయాదవ్‌, నియోజవ కవర్గ పరిశీలకులు హరి, ప్రభాకర్‌రెడ్డి, వై లక్ష్మీనారాయణయాదవ్‌, టి శ్రీనివాసులు, ఖాజా పీర్‌, రామ్మోహనయాదవ్‌, మధు, రమేష్‌రెడ్డి, చల్లా వీర, నాగేంద్ర, అలేబాదు పరమేష్‌, ఆర్‌ఈ నాగరాజు, కలచట్ల ప్రసాద్‌, రమణగౌడు, నబీరసూల్‌, శ్రీరాములు, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 12:13 AM